కరోనా వైరస్ కారణంగా చాలా మంది అనేక ఇబ్బందులతో సతమతమవుతున్నారు. వాట్సాప్ లో చాలా ఫేక్ మెసేజ్లు కూడా వస్తున్నాయి. దీని వల్ల చాలా ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. తాజాగా ఈ తరహాలో ఒక మెసేజ్ వచ్చింది. దీనిలో నిజం ఎంత అనేది ఇప్పుడు తెలుసుకుందాం.
కేంద్ర ప్రభుత్వం ఫేస్ ఫోర్ కోవిడ్ 19 రిలీఫ్ ఫండ్ ని ప్రజలకు ఇస్తోందని.. దేశ వ్యాప్తంగా ఉన్న ప్రజలు దీని కోసం అప్లై చేసుకోవచ్చు అని వార్త వచ్చింది. కరోనా వైరస్ నేపథ్యంలో ఈ తరహా మెసేజ్లు చాలా వస్తున్నాయి. అయితే ఇప్పుడు వచ్చిన ఈ మెసేజ్ లో నిజమెంత అనేది ఇప్పుడు చూద్దాం.
ప్రభుత్వం కోవిడ్ 19 కారణంగా ప్రజలకి సపోర్ట్ చేయడానికి ఫండ్ ని ఆన్లైన్ లో ఒక వెబ్ సైట్ ద్వారా ఇస్తోందని దాని కోసం అప్లై చేసుకో వచ్చు అని వార్త వచ్చింది. అయితే దీనిలో ఏ మాత్రం నిజం లేదని కేవలం ఈ ఇది ఫేక్ మెసేజ్ అని తెలుస్తోంది.
గవర్నమెంట్ ఫేస్ ఫోర్ ప్రైవేట్ లిమిటెడ్ రిలీఫ్ ఫండ్ కోసం ప్రభుత్వం ప్రజలకి సహాయం చేస్తోందని త్వరగా అప్లై చేసుకోమని మెసేజ్ వస్తోంది. అదే విధంగా ఈ అవకాశాన్ని ఎవరు వదులుకో వద్దు అని వాట్సాప్ లో తెగ వైరల్ అయిపోతుంది.
ఇది కేవలంఫేక్ మెసేజ్ అని ప్రజలు గమనించాలి. దీనిలో ఏ మాత్రం నిజం లేదు. కనుక దీనిని ఫార్వర్డ్ చేయకండి. చాలా మంది ఫేక్ మెసేజ్లని ఫార్వర్డ్ చేస్తున్నారు. దీని వల్ల ఎన్నో ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఇటువంటి ఫేక్ మెసేజ్స్ ని షేర్ చేయకుండా ఉండటం మంచిది.