ఫ్యాక్ట్ చెక్: లాటరీ తో రూ.25 లక్షలు..!

-

సోషల్ మీడియాలో తరచు మనకి ఎన్నో నకిలీ వార్తలు కనబడుతూ ఉంటాయి అయితే నిజానికి ఏది నిజమైన వార్త ఏది నకిలీ వార్త అని తెలుసుకోవడం కష్టం. నకిలీ వార్తల్ని చూసి చాలా మంది మోసపోతుంటారు. పైగా వాటిని పదే పదే షేర్ చేస్తూ ఉంటారు. వీటి వల్ల ఇతరులు కూడా ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఇక ఇది ఇలా ఉంటే తాజాగా సోషల్ మీడియాలో ఒక వార్త వైరల్ అవుతోంది. అయితే ఆ వార్త నిజమా కాదా అసలు ఆ వార్త ఏమిటి అనే విషయాలను చూద్దాం.

కేబీసీ లాటరీ అంటూ ఒక వార్త సోషల్ మీడియాలో తెగ షికార్లు కొడుతోంది. దీనితో పాతిక లక్షల రూపాయల పొందచ్చని వాట్సాప్ లో వస్తోంది. కౌన్ బనేగా క్రోర్ పతి కింద పాతిక లక్షల రూపాయలు లక్కీ విన్నర్స్ గెలుచుకోవచ్చు అని అందులో ఉంది అయితే ఇంతకీ ఇది నిజమా కాదా అనేది ఇప్పుడు చూద్దాం. కౌన్ బనేగా క్రోర్ ప్రతి నుండి అంజలి శర్మ మాట్లాడుతున్నట్లు కూడా అందులో ఉంది.

కంగ్రాట్యులేషన్స్ మీరు పాతిక లక్షల రూపాయల లాటరీని గెలుచుకున్నారు అని ఒక ఆమె చెప్తోంది. మెసేజ్ ని మనం చూసుకున్నట్లయితే ఇది వట్టి ఫేక్ వార్త అని తెలుస్తోంది. అయితే ఈ డబ్బులన్నీ గెలుచుకోవాలంటే బ్యాంక్ మేనేజర్ దగ్గరికి వెళ్లాలని కూడా ఆ మెసేజ్ లో ఉంది అయితే ఇది నకిలీ వార్త మాత్రమే డబ్బులు ని దోచుకోవడానికి ఇది ఒక మార్గం. అంతేకానీ ఇది నిజం కాదు కనుక అనవసరంగా ఇటువంటి ఫేక్ వార్తలని నమ్మకండి. ఎప్పటి నుండో ఈ మెసేజ్ వాట్సాప్ లో వస్తోంది. పీఐబీ ఫ్యాక్ట్ చెక్ ఎప్పుడో దీనిపై స్పందించి నకిలీ వార్త అని చెప్పేసింది. కనుక ఇటువంటి నకిలీ వార్తలకి దూరంగా ఉండండి. లేదంటే మోసపోవాల్సి వస్తుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version