Breaking : పాతబస్తీలో దొంగబాబా అరెస్ట్‌.. మహిళల నగ్న వీడియోలు తీసి వేధింపులు

-

శాస్త్ర సాంకేతిక రంగాలు శరవేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రస్తుత సమాజంలో ఎక్కడో ఓ చోట మూఢ నమ్మకాలు తమ ఉనికిని చూటుతూనే ఉన్నాయి. మారుమూల ప్రాంతాల్లో ఇప్పటికీ వాటినే అనుసరిస్తున్నారు. అనారోగ్యం, కుటుంబ సమస్యలు, ఆర్థిక విభేదాలు..కారణం ఏదైనా వాటి పరిష్కారానికి మంత్రాలు ఎంతో ఉపయోగపడతాయని భావిస్తున్నారు. దీంతో నకిలీ బాబాలకు ప్రాధాన్యం ఏర్పడింది. వీరి అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకున్న ప్రబుద్ధులు వారి నుంచి అందిన కాడికి దోచుకుంటున్నారు. అంతే కాదు. కొన్ని సందర్భాల్లో వారిపై శారీరక దాడులకూ పాల్పడుతున్నారు. ఏది వాస్తవమో, ఏది అవాస్తవమో తెలియక బాధితులు నిలువునా మోసపోతున్నారు.

అయితే.. ఇలాంటి ఘటనే హైదరాబాద్‌ పాతబస్తీలో వెలుగు చూసింది. మూఢనమ్మకాలతో ఓ బాబా ముసుగులో ఉన్న కేటుగాడి దగ్గరకు వెళ్లిన మహిళలను పూజల పేరుతో అరాచకాలు చేశాడు. నీలో చెడు శక్తి ఉందంటూ నమ్మ బలికి పూజల పేరుతో మహిళలను నగ్నంగా వివస్త్రలను చేసి వారి వీడియోలు తీసి పైశాచిక ఆనందం పొందేవాడు. అయితే.. ఈ దొంగ బాబా దగ్గరకు వెళ్లిన ఓ మహిళా బాధితురాలి ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన పోలీసులు.. ఈ దొంగబాబా ఆట కట్టించారు. దొంగ బాబాను అరెస్ట్‌ చేసి విచారిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version