బ్రేకింగ్‌: టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాష్‌పై మరో కేసు నమోదు

-

టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాష్‌ మరో వివాదంలో చిక్కుకున్నాడు. నకిలీ ఐడీ కేసులో రవిప్రకాష్‌పై మరో కేసు నమోదయ్యింది. ఐ ల్యాబ్ పేరుతో నటరాజన్ అనే వ్యక్తి పేరు మీద ఫేక్ ఐడి కార్డు క్రియేట్ చేసినట్టు రవిప్రకాశ్‌పై అభియోగాలు నమోదయ్యాయి. దీంతో 406/66 ఐటీ యాక్ట్ కింద కేసు నమోదు అయ్యింది.

చంచల్ గూడ జైలు నుంచి పిటి వారెంట్ ద్వారా మియాపూర్ కోర్టుకు పోలీసులు తీసుకెళ్తున్నారు. కాగా ఇందుకు సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది. ఇక ఇప్పటికే రవిప్రకాష్ పైన బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో రెండు కేసులు నమోదయ్యాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version