వామ్మో.. వీడు మామూలోడు కాదురో.. సినిమాలని మించిన కధ !

-

సినిమాలు చూసి జనాలు చేడిపోతున్నారో లేక జనాన్ని చూసి సినిమాలు తీస్తున్నారో తెలీదు కానీ తాజాగా వెలుగులోకి వచ్చిన ఓ విషయం మాత్రం సంచలనం రేపింది. రా ఏజెంట్ పేరుతో మహిళలను ఆనంద వర్ధన్ అనే వ్యక్తీ మోసం చేశాడు. మహిళలను ట్రాప్ చేయడానికి తను ఒక ఎక్స్ ఆర్మీ ఆఫీసర్ గా పరిచయం చేసుకున్నాడు ఆనంద్. తాను పని చేస్తున్న కంపెనీలో బాధిత మహిళను ట్రాప్ చేయడానికి ఆర్మీ రా ఏజెంట్ గా పని చేసినట్లు పరిచయం చేసుకున్నాడు ఆనంద్. సదరు మహిళకు గతంలో విడాకులు అయిన విషయాన్ని తెలుసుకొని తనకు కూడా గతంలో వివాహమై విడాకులు తీసుకున్నట్లు నకిలీ సర్టిఫికెట్లను సృష్టించాడు.

ఇద్దరం కలిసి కొత్త జీవితాన్ని ప్రారంభించాలని మోసం చేసి, బాధిత మహిళ తో వివాహం జరిగినట్లు నకిలీ మ్యారేజ్ సర్టిఫికేట్ సృష్టించాడు. ఆ అనంతరం సదరు మహిళకు సంబంధించిన బంగారాన్ని తాకట్టు పెట్టాడు ఆనంద్. బంగారం తీసుకురావాలని బాధిత మహిళ ఒత్తిడి చేయడంతో తనను ఇద్దరు బెదిరిస్తున్నట్లు కొత్త క్యారెక్టర్లు సృష్టించాడు ఆనంద్. అలానే తను రా ఏజెంట్ కాబట్టి తనను కిడ్నాప్ చేసి హత్య చేశారని కథను సృష్టించిన ఆనంద్, తాను ఇక లేను అన్నట్టు ఆమె ముందు కధ సృష్టించాడు. అనుమానం వచ్చిన బాధిత మహిళ పోలీసులను ఆశ్రయించడంతో అసలు గుట్టు బయట పడింది. కేసు నమోదు చేసుకున్న నార్సింగ్ పోలీసులు నకిలీ ఆర్మీ అధికారి గా చలామణి అవుతున్న ఆనంద్ ని అరెస్టు చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version