తెలుగు చలన చిత్ర పరిశ్రమలో నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న ఉదయ్ కిరణ్ ఉన్నట్టుండి మరణించడం సినీ ఇండస్ట్రీ నే శోకసంద్రంలో ముంచేసింది. ఎంతో టాలెంట్ ఉండి కూడా ఆర్థిక సమస్యల వల్లే ఉదయ్ కిరణ్ మరణించాడు అని అందరూ అనుకున్నారు. ముఖ్యంగా సినీ ఇండస్ట్రీలో ఉన్నప్పుడు ఉదయ్ కిరణ్ కోసం స్టార్ దర్శకులు, నిర్మాతలు కూడా ఆయన డేట్స్ కోసం ఎదురుచూసిన రోజులు ఉన్నాయి. అలా ఎదిగిన ఉదయ్ కిరణ్ ఆ తర్వాత సినిమా అవకాశాలు లేకపోవడం పర్సనల్ గా ఇబ్బందులతో పాటు ఆర్థిక సమస్యలు కూడా రావడంతో చిన్న వయసులోనే చనిపోయాడు అని ఇప్పటివరకు మనకు తెలిసిన విషయం ఇది.
కానీ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో ఉదయ్ కిరణ్ తో కలిసి సినిమాలు చేసిన నటుడు దిల్ రమేష్ ఆసక్తికర విషయాలను వెల్లడించారు. నువ్వు నేను సినిమాలో దిల్ రమేష్ ఉదయ్ కిరణ్ తో కలిసి నటించారు. దిల్ రమేష్ మాట్లాడుతూ .. నేను కలిసిన నటించిన ఉదయ్ కిరణ్ ,శ్రీహరిలు చనిపోవడం.. నా సినిమా జీవితంలోనే ఒక విషాదం.. శ్రీహరితో కలిసి దాదాపు పది సినిమాలలో నటించాను . నువ్వు నేను సినిమా సమయంలో ఉదయ్ కిరణ్ నాతో చాలా ఫ్రెండ్లీగా ఉండేవారు. ఉదయ్ కిరణ్ హీరో అనే ఫీలింగ్ నాకు ఎప్పుడు కలవలేదు.. అంతలా చాలా క్లోజ్ గా ఉండేవాడు ఉదయ్ కిరణ్ .. సినిమా ఆఫర్లు లేకపోవడంతోనే డిప్రెషన్ లోకి వెళ్లిపోయారు.
ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీలో ఎంతో సక్సెస్ ని చూశారు. ఇండస్ట్రీలో రూ.70 లక్షల రెమ్యూనరేషన్ అతి చిన్న వయసులోనే తీసుకున్న ఘనత ఉదయ్ కిరణ్ కే దక్కింది . కాబట్టి ఉదయ్ కిరణ్ ఆర్థిక సమస్యలతో చనిపోలేదు. కేవలం డిప్రెషన్ వల్లే అలా చేసుకున్నాడు అంటూ అసలు విషయాన్ని బయటపెట్టారు దిల్ రమేష్.