పుష్ప -2 బెనిఫిట్ షో కారణంగా సంధ్య థియేటర్లో జరిగిన తొక్కిసలాట ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారిన విషయం తెలిసిందే.ఈ ఘటనలో ఇప్పటికే అల్లుఅర్జున్ మీద కేసు ఫైల్ అవ్వడంతో పాటు ఆయన ఒక రోజు జైలుశిక్ష సైతం అనుభవించి ప్రస్తుతం మధ్యంతర బెయిల్ మీద బయటకు వచ్చారు.
ఈ క్రమంలోనే బన్నీపై ప్రముఖ నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ సీరియస్ అయ్యారు. ఒక్క మనిషి కోసం సినీ పరిశ్రమలోని పెద్దలు సీఎం రేవంత్ ముందు తలవంచుకునే పరిస్థితి ఏర్పడిందన్నారు. అల్లు అర్జున్ పక్కన ఉన్నవారు సరైన సలహా ఇవ్వకపోవడం తొక్కిసలాటకు ఓ కారణమని పేర్కొన్నారు. ఎలాంటి ప్రచారం లేకుండా సినిమాకు వెళితే ఇలా జరిగి ఉండకపోవచ్చని అభిప్రాయపడ్డారు. కొందరు హీరోలు సొంతంగా నిర్ణయం తీసుకోలేకపోవడం సమస్యగా మారిందని చెప్పారు. కలెక్షన్లతో కాకుండా నటనతో గర్వకారణంగగా మారాలని హితవుపలికారు.