ప్రముఖ టాలీవుడ్ కమెడియన్ ఇంట తీవ్రమైన విషాదం..!!

-

తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఈ మధ్యకాలంలో వరుసగా విషాదాలు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. కొంతమంది సీనియర్ ఆర్టిస్టులు అలాగే కొన్ని విభాగాలకు చెందిన టెక్నీషియన్స్, నిర్మాతలు, నటీనటులు సైతం కన్ను మూయడం జరిగింది. అంతేకాకుండా నటీనటుల కుటుంబాలలో కూడా మరణ వార్తలు ఎక్కువగానే వింటూ ఉన్నాము. ఇక గడిచిన కొద్దిరోజుల క్రితం హీరోయిన్ మీనా భర్త, మరొక హీరోయిన్ రాధిక శరత్ కుమార్ మాజీ భర్త, హీరో అర్జున్ తల్లి, కమెడియన్ సారధి, ఇక ఎన్టీఆర్ చిన్న కూతురు ఉమామహేశ్వరి కూడా మృతి చెందడం జరిగింది. అయితే ఇప్పుడు తాజాగా టాలీవుడ్ కమెడియన్ తండ్రి మరణించడం జరిగింది వాటి గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.ప్రముఖ కమెడియన్లలో ఒకరైన రఘు కారుమంచి ప్రతి ఒక్కరికి సుపరిచితమే.. ఈయన తన కామెడీ టైమింగ్ తో మంది ప్రేక్షకులను బాగా అలరించారు. ఆ మధ్య అవకాశాలు లేక మద్యపానం షాప్ లో కూడా పనిచేశారు. ఇక ఈ రోజున ఈయన తండ్రి మృతి చెందినట్లు తెలుస్తోంది. దీంతో మరొకసారి టాలీవుడ్ లో విషాద ఛాయలు ఏర్పడ్డాయని చెప్పవచ్చు. ఇక రఘు తండ్రి వెంకట్ రావు నిన్నటి రోజున కన్నుమూయడం జరిగింది. ఈయన వయసు 74 సంవత్సరాలు. గత కొంతకాలంగా అనారోగ్య సమస్యతో బాధపడుతున్న ఈయన నిన్నటి రోజున తుది శ్వాస విడవడం జరిగింది.

ఇక రఘు తండ్రి కూడా ఆర్మీ అధికారిగా దేశానికి ఎన్నో సేవలు అందించారు. రిటైర్మెంట్ తర్వాత ఆయన ఇంటి దగ్గరే ఉంటూ తన కొడుకు సినీ ఇండస్ట్రీలో కమెడియన్గా రాణిస్తున్నందుకు చాలా సంతోషంతో ఉండేవారట. ఇక వెంకట్రావు మృతి పట్ల బంధువులు , స్నేహితులతో పాటు..ఇండస్ట్రీలోని కొంతమంది రఘు స్నేహితులు కూడా సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఇక వీరితోపాటు కొంతమంది సినీ ప్రముఖుల సైతం తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. రఘు కారుమంచి ఇప్పటివరకు వందకు పైగా సినిమాలలో నటించి బాగా ఆకట్టుకున్నారు. బుల్లితెరపై కూడా జబర్దస్త్ లో ఒక టీమ్ లీడర్గా ఎంట్రీ ఇచ్చి ఎన్నో స్కిట్లలో అలరించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version