RRR : ఎన్టీఆర్‌ ముఖంపై గాయం.. అసలు ఏం జరిగిందంటే?

-

ప్ర‌పంచ‌మంతా ఎంత‌గానో ఎదురు చూస్తున్న ప్ర‌ముఖ మూవీ ఆర్ఆర్ఆర్. ద‌ర్శ‌క ధీరుడు రాజ‌మౌళి తీస్తున్న మూవీ కావ‌డంతో అంచ‌నాలు ఆక‌శాన్ని తాకుతున్నాయి. ఇక ఈ సినిమా ఎప్పుడు విడుదలవుతుందా? ఎప్పుడు థియేటర్‌కు వెళ్లి ఈలలు వేసి గోల చేద్దామా? అని అభిమానులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. అయితే.. ఆర్‌ఆర్‌ఆర్‌’ టీమ్‌ మాత్రం హాయిగా సినిమా సెట్లో కాలక్షేపం చేస్తోంది. ఈ సినిమా షూటింగ్‌ తుది దశకు చేరుకున్న విషయం తెలిసిందే. దీంతో షూటింగ్‌కు మధ్యలో దొరికిన కాస్త విరామ సమయంలో తన హీరోలతో జక్కన్న సరదాగా సమయం గడిపారు.

చరణ్‌, తారక్‌ పిట్టగోడ మీద కూర్చొని కబుర్లు చెప్పుకొంటూ ఉండగా.. ఆ దృశ్యాలను రాజమౌళి ఒక డమ్మీ కెమెరాతో చిత్రీకరిస్తున్నట్లు కనిపించారు. ఈ వీడియోను ఆర్ఆర్‌ఆర్‌ టీమ్‌ సోషల్‌ మీడియాలో పంచుకుంది. అయితే.. ఆ వీడియోలో ఎన్టీఆర్‌ మొహంపై గాయం అయినట్లు కనిపిస్తోంది. దీంతో అభిమానులు ఆందోళనకు గురవుతున్నారు. బహుశా షూటింగ్‌లో భాగంగా చిన్న గాయమైనట్లు అందురు అనుకుంటున్నారు. అయితే.. తాజాగా ఈ గాయంపై సినిమా బృందం ఎన్టీఆర్‌ గాయంపై క్లారిటీ ఇచ్చింది. ఆ వీడియోలో ఎన్టీఆర్‌ మొహంపై ఉన్న గాయం.. షూటింగ్‌ లో భాగమేనని క్లారిటీ ఇచ్చింది. ఫ్యాన్స్‌ ఎవరు కూడా ఆందోళన చెందవద్దని తేల్చేసింది చిత్ర బృందం.

Read more RELATED
Recommended to you

Exit mobile version