అందంతో చెమటలు పట్టిస్తున్న ఫరియా అబ్దుల్లా..!!

-

జాతి రత్నాలు.. మొదటి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకున్న ఫరియా అబ్దుల్లా ఒక వర్గం ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఏ రేంజ్ లో విజయాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. ఈ సినిమాలో హీరోయిన్ గా నటించిన ఫరియా అబ్దుల్లా పేరు కూడా అంతే స్థాయిలో మారుమ్రోగింది. సాధారణంగా సినిమాలో నటించిన అందరూ కూడా ఇండస్ట్రీలో మంచి మంచి అవకాశాలతో బిజీ అయిపోయారు. కానీ ఈమె మాత్రం ఆ తర్వాత ఒక్క సరైన అవకాశాన్ని కూడా అందుకోలేకపోతోంది. ఈమె గ్లామర్ తో ఇప్పుడు అందరిని ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది.

అప్పుడప్పుడు గ్లామర్ డోస్ కూడా పెంచుతూ ఫ్యాషన్ దుస్తుల్లో కుర్ర కారుకు చెమటలు పట్టించే ఈ ముద్దుగుమ్మ తాజాగా మరొకసారి అందాలు ప్రదర్శిస్తూ యువతను ఆకట్టుకుంది. మునుపెన్నడు లేనివిధంగా బ్లాక్ డ్రెస్ ధరించి బ్లాక్ అండ్ వైట్ ఫోటోలతో అదరగొట్టేసింది. గతంలో ఎప్పుడూ లేనంతగా గ్లామర్ లుక్స్ షేర్ చేస్తూ మరింతగా అలరించింది ఈ ముద్దుగుమ్మ. టాలెంటెడ్ నటి అయినప్పటికీ కూడా ఆమెకు సరైన అవకాశాలు ఇంతవరకు రాలేదు. రీసెంట్గా వచ్చిన లైక్ షేర్ సబ్స్క్రైబ్ అనే సినిమా దారుణంగా డిజాస్టర్ అయ్యింది. ప్రస్తుతం కూడా కొన్ని సినిమాలయితే చేస్తోంది కానీ అవి ఏవి కూడా ఈమె కెరీర్ కు ఉపయోగపడతాయని చెప్పలేము.

మరొకపక్క ఈమె హైట్ ఈమెకు పెద్ద మైనస్ గా మారింది. ప్రస్తుతం స్టార్ హీరోలలో ఈమె హైట్ మ్యాచ్ చేసేవారు ముగ్గురు నలుగురు తప్పితే ఎవరూ లేరు.. మిగతా స్టార్స్ సాహసం కూడా చేయలేరు. ఒకప్పుడు అనుష్క కూడా ఇదే తరహా సమస్యతో ఇబ్బంది పడింది. కానీ ఆమె లేడీ ఓరియంటెడ్ చిత్రాలు తీసి సత్తా చాటింది. ప్రభాస్ ,గోపీచంద్ లాంటి హీరోలతో చేసిన తర్వాత ఆమె క్రేజ్ పెరిగిపోవడంతో గుర్తింపు లభించింది. మరి ఫరియా కు కూడా అలాంటి హిట్స్ వస్తే తప్ప తాను కెరియర్లో ముందుకు పోలేదని చెప్పాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version