62.99 లక్షల మంది ఖాతాల్లో రైతు బంధు జమ : మంత్రి నిరంజన్

-

62.99 లక్షల మంది రైతులకు రూ.7411.52 కోట్లు జమ అయ్యాయని… కోటీ 48 లక్షల 23 వేల ఎకరాలకు రైతుబంధు నిధులు విడుదల అయినట్లు రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి పేర్కొన్నారు. అత్యధికంగా నల్గొండ జిల్లాలో 4,69,696 మంది రైతులకు రూ.601,74,12,080 కోట్ల నిధులు జమ అయ్యాయని.. సంగారెడ్డి జిల్లాలో 3,18,988 మంది రైతులకు రూ.370,74,52,397 కోట్ల నిధులు జమ అయినట్లు తెలిపారు.

నాగర్ కర్నూలు జిల్లాలో 2,77,920 మంది రైతులకు రూ.367,35,27,173 కోట్ల నిధులు, ఖమ్మం జిల్లాలో 3,08,479 మంది రైతులకు రూ.356,12,83,145 కోట్ల నిధులు జమ అయినట్లు వెల్లడించారు. రంగారెడ్డి జిల్లాలో 2,94,972 మంది రైతులకు రూ.345,33,35,080 కోట్ల నిధులు, సిద్దిపేట జిల్లాలో 2,94,362 మంది రైతులకు రూ.310,65,93,586 కోట్ల నిధులు, సూర్యాపేట జిల్లాలో 2,61,079 మంది రైతులకు రూ.309,28,13,804 కోట్ల నిధులు జమ అయినట్లు స్పష్టం చేశారు. వనపర్తి జిల్లాలో 1,58,994 మంది రైతులకు రూ.180,40,64,102 కోట్ల నిధులు, అత్యల్పంగా మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లాలో 33,452 మంది రైతులకు రూ.33.65 కోట్లు విడుదలైనట్లు చెప్పారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version