నల్గొండలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు స్పాట్ డెడ్

-

నల్గొండ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో ఇద్దరు వ్యక్తులు స్పాట్‌లోనే చనిపోయినట్లు తెలుస్తోంది. అతివేగంగా వెళ్తున్న కారు ముందుగా బైకును ఢీకొని అనంతరం చెట్టును ఢీకొట్టడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. జిల్లాలోని తిప్పర్తి మండల కేంద్రంలో శనివారం ఉదయం ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.

స్థానికుల కథనం ప్రకారం.. మిర్యాల గూడెం మండలం దిలావర్ పూర్ గ్రామానికి చెందిన గంధం శ్రీనివాస్ (33) నల్గొండ నుంచి మిర్యాలగూడ వైపు వెళ్తున్నారు. అదే టైంలో వేగంగా వస్తున్న కారు మిర్యాలగూడ వైపు వెళ్తుండగా శ్రీనివాస్ వాహనాన్ని ఢీ కొట్టింది. అనంతరం వెళ్లి చెట్టును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్ పై ఉన్న శ్రీనివాస్, కారులోని మరో మహిళ స్పాట్ లోనే చనిపోయారు. మరో ఇద్దరికి సీరియస్‌గా ఉండటంతో జిల్లాలోని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు దీనిపై విచారణ జరుపుతున్నారు. ప్రమాదానికి గురైన కారును అక్కడి నుంచి తరలించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version