మొబైల్​ అంటే ఎందుకంత పిచ్చి.. సెల్​ఫోన్ పితామహుడు మార్టిన్ ఆవేదన

-

ప్రజెంట్ జనరేషన్ ఓ పూట తిండి లేకపోయినా బాధపడటం లేదు కానీ చేతిలో అరక్షణం మొబైల్ లేకపోతే మాత్రం భరించలేకపోతోంది. కాసేపు ఫోన్ పక్కన పెట్టాలంటే.. తమ శరీరంలో ఏదో ఒక భాగం కోసేస్తున్నట్లు భావిస్తోంది నేటి తరం. మొబైల్ వాడకంలో రోజురోజుకు విశృంఖలత్వం పెరిగిపోతోంది. ఈ విషయంపై సెల్​ఫోన్ పితామహుడు మార్టిన్ కూపర్ ఆవేదన వ్యక్తం చేశారు.

1973 ఏప్రిల్‌ 3న ఈ అమెరికన్‌ ఇంజినీర్‌ తొలిసారి తాను తయారుచేసిన మొబైల్‌లో మార్టిన్ సంభాషించారు. ఆ మొబైలే.. ఇప్పుడు స్మార్ట్‌ఫోన్‌గా రూపాంతరం చెంది మానవ సమాచార వ్యవస్థను సమూలంగా మార్చేసింది. అందుకే అందరూ మార్టిన్‌ను ‘సెల్‌ఫోన్‌ పితామహుడు’ అంటారు. అయితే ప్రస్తుతం పలువురు సెల్‌ఫోన్‌ వాడుతున్న తీరుపై మార్టిన్‌ సంతృప్తిగా లేరు.

‘‘మరీ ఎక్కువగా వినియోగిస్తున్నారు. సెల్‌ఫోన్‌ చూస్తూ ఎవరైనా రోడ్డు దాటడం చూస్తే.. బాధేస్తుంది. వ్యామోహం ఎక్కువైంది’’ అని మార్టిన్‌ పేర్కొన్నారు. సెల్‌ఫోన్‌తో ప్రయోజనాలూ భవిష్యత్తులో భారీగా ఉంటాయని కూపర్‌ తెలిపారు. ప్రతి ఒక్కరి చేతుల్లో ఎంతో చక్కగా కనిపిస్తోన్న ఈ పరికరం.. ఏదో ఒకరోజు వ్యాధులను జయించడానికి దోహదం చేస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version