ఐదేళ్ళ కూతురుపై తండ్రి అత్యాచారం

-

విజయవాడలో మరో దారుణం చోటు చేసుకుంది. కన్న కూతురు పైనే అత్యాచారం చేశాడు చినబాబు అనే కసాయి తండ్రి. ఐదేళ్ళ చిన్నారి తో లైంగిక వాంఛలు తీర్చుకున్నాడు ఆ కసాయి తండ్రి. కూతురు బాగా ఏడువడం తో తండ్రి చినబాబు అరాచకం వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన వివరాల్లోకి వెళితే.. స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్ కాలేజీ మరియ వికాస్ ఇంజనీరింగ్ కాలేజీల్లో పిడి గా పనిచేస్తున్నాడు చినబాబు.

అయితే ఆరేళ్ళ కింద ప్రేమ వివాహం చేసు కున్నాడు చినబాబు. పెళ్లి జరిగిన ఏడాదికే.. కూతురు పుట్టింది. అయితే తాజాగా తన కూతురు పై అఘాయిత్యం చేశాడు చినబాబు. ఈ ఘటన బయట పడ్డ అనంతరం.. భర్త చినబాబు పై దిశ పోలీసు స్టేషన్ లో పిర్యాదు చేసింది బాధితురాలు తల్లి. బాధితురాలి తల్లి ఫిర్యాదు తో పొక్సా చట్టం కింద కేసు నమోదు చేశారు పోలీసులు. ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది చిన్నారి. అయితే ఈ కేసు వెనక్కి తీసుకోవాలిని చిన్నారి తల్లికి బెదిరింపులు కూడా రావడం కొసమెరుపు.

Read more RELATED
Recommended to you

Exit mobile version