ఆహార పంట లలో ఒకటి సజ్జ..ఈ పంటను మన భారత దేశంలో ఎక్కువగా పండిస్తున్నారు. ఒక్క పశ్చిమ బెంగాల్, అస్సాంలో తప్ప, ఇది దేశవ్యాప్తంగా పెరుగుతుంది. ఇది సాధారణంగా తక్కువ వర్షపాతం ఉన్న ప్రాంతాలలో మరియు పేలవమైన నేలల్లో పెరుగుతుంది..రాజస్థాన్, మహారాష్ట్ర, గుజరాత్, యూపి మరియు హర్యానా మొత్తం విస్తీర్ణంలో 87% ఉన్నాయి. దాదాపు 78% ఉత్పత్తి ఈ రాష్ట్రాల నుంచే వస్తోంది. బజ్రా ఉత్పత్తిలో భారతదేశం అతిపెద్దది. ఇది మిలియన్ల మంది ప్రజలకు విశ్వసనీయంగా ఆహారం మరియు మేతను ఉత్పత్తి చేస్తుంది, ఇక్కడ పెరుగుతున్న పరిస్థితులు చాలా పొడిగా ఉంటాయి.
ఈ పంట విత్తుకోవడానికి అనుకూల వాతావరణం..
ఈ పంటను పండించడానికి అన్నీ కాలాలు బాగానే ఉంటుంది.ఉష్ణోగ్రత, నీటి ఎద్దడి ని తట్టుకొని మంచి దిగుబడిని ఇస్తుంది.
ఈ పంటకు తక్కువ వర్ష పాతం మరియు పొడి వాతావరణం అవసరం
పంట ఏపుగా పెరిగే దశ లో తేమ గల వాతావరణం, వర్ష పాతం, మంచి సూర్య రశ్మి అవసరం
పంట పూత దశ లో వర్షానికి గురి కాకుండా చూసుకోవాలి. వర్షం ఉన్నట్లయితే పుప్పొడి వర్షం నీళ్ళలో కొట్టుకొని పోవడం మరియు పరాగ సంపర్కం తక్కువ గా ఉంటుంది. దాని వల్ల దిగుబడి తగ్గును.
పక్వ దశ లో పొడి వాతావరణం క్షణం తో కూడిన అధిక సూర్య రశ్మి అవసరం.
సజ్జ పంట నీటి ఎద్దడి ని బాగా తట్టుకొంతుంది. కాని అధిక వర్ష పాతం, మంచు ను తట్టుకోలేదు..
ఈ పంట పై ఎటువంటి సందెహాలు ఉంటే దగ్గరలోని వ్యవసాయ నిపుణులను అడగటం మంచిది..