నేడు తెలంగాణలో 5వ రోజు రాహుల్‌ గాంధీ పాదయాత్ర.. వివరాలు ఇవే..

-

ఏఐసీసీ నేత రాహుల్‌ గాంధీ భారత్‌ జోడో యాత్ర పేరిట దేశ వ్యాప్తంగా పాదయాత్రకు శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. అయితే.. ప్రస్తుతం తెలంగాణలో రాహుల్‌ గాంధీ యాత్ర సాగుతోంది. నేడు తెలంగాణలో 5వ రోజు భారత్ జోడో యాత్రప్రారంభమైంది. నిన్న కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ పాదయాత్ర జడ్చర్ల సమీపంలోని గొల్లపల్లిలో ముగిసింది. అక్కడే బస చేసిన రాహుల్ గాంధీ ఇవాళ అక్కడి నుంచే పాదయాత్రను తిరిగి ప్రారంభించారు. ఉదయం 11 గంటలకు బాలానగర్ జంక్షన్ వద్దకు చేరుకుంటారు. తన పాదయాత్రలో భాగంగా రాహుల్ గాంధీ విద్యార్థులు, రైతులు, ప్రొఫెసర్లతో చర్చిస్తున్నారు. ఇవాళ ప్రజాస్వామ్యం, లౌకికవాదంపై ఆయన ప్రొఫెసర్లతో చర్చించనున్నారు.

రాష్ట్రంలో ఎస్సీలు ఎదుర్కొంటున్న సమస్యలపై రచయిత ఇండస్ మార్టెన్ బృందంతో రాహుల్ మాట్లాడతారు. అనంతరం ఉపాధి హామీ రైతు కూలీలతో సమావేశమై వారి సమస్యల గురించి చర్చిస్తారు. అనంతరం భోజనం విరామం ఉంటుంది. మళ్ళీ సాయంత్రం 4 గంటలకు రాహుల్ పాదయాత్ర పున:ప్రారంభం కానుంది. కన్యాకుమారి నుంచి రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రను ప్రారంభించిన విషయం తెలిసిందే. తమిళనాడు, కర్ణాటక, కేరళ, ఏపీలో భారత్ జోడో యాత్ర ఇప్పటికే ముగిసింది. కశ్మీర్ వరకు రాహుల్ పాదయాత్ర కొనసాగిస్తారు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version