ఈ నెల 25న భారత్-ఆస్ట్రేలియా మధ్య ఉప్పల్ స్టేడియంలో మ్యాచ్ జరగనున్న సంగతి తెలిసిందే. అయితే, ఈ నేపథ్యంలో మ్యాచ్ టికెట్ల జారీలో జాప్యంపై క్రికెట్ అభిమానులు ఇవాళ ఉదయం క్యూ కట్టారు. ఇక హెచ్‌సీఏ వైఖరికి నిరసనగా నగరంలోని జింఖానా మైదానం వద్ద ఆందోళనకు దిగారు. అటు టికెట్ల కోసం భారీగా గ్రౌండ్ కు చేరుకుంటున్నారు క్రికెట్ ఫ్యాన్స్.
దీంతో జింఖానా గ్రౌండ్స్, పెరేడ్ గ్రౌండ్స్, ప్యారడైజ్ రోడ్స్ రద్దీగా మారాయి. 3 వేల టికెట్లు మాత్రమే ఆఫ్ లైన్ లో అమ్ముతారని సమాచారం అందుతోంది. క్రౌడ్ 30 వేలకు మించి ఉంది. క్యూ లైన్స్ లో 2 వేలకు పైగా మహిళలు ఉన్నారు. అంతేకాదు… ఆధార్ కార్డు తీసుకుని వచ్చిన వారేకే టికెట్లు ఇస్తామని.. ఒక్కరికి రెండు టికెట్లు మాత్రమే ఇస్తామని పేర్కొంది హెచ్ సీఏ.