పైకి న‌వ్వులు… లోప‌ల క‌త్తులు దూస్తోన్న ఆ ఇద్ద‌రు టీడీపీ ఎమ్మెల్యేలు…!

-

ముందు న‌వ్వులు చిందించుకోవ‌డం…వెనుక క‌త్తులు దూసుకోవ‌డం రాజ‌కీయాల్లో ప‌రిపాటే. ముందు నుంచి ఉప్పు నిప్పులా ఉండే చీరాల ఎమ్మెల్యే క‌ర‌ణం బ‌ల‌రాం, అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి ర‌వికుమార్ ఇప్పుడు అదే సూత్రాన్ని అన్వ‌యించుకుంటూ ముందుకు సాగుతున్న‌ట్లు స‌మాచారం. సోష‌ల్ మీడియాలో ఒక‌రిపై ఒక‌రు సెటైర్లు వేసుకుంటూనే పైకి మాత్రం అదేం లేదు మేం ఇద్ద‌రం మంచి స్నేహితులు. మా అభిమానుల్లో ఎవ‌రో అలా చేసి ఉంటారు…దీన్ని పెద్ద సీన్ చేయ‌వ‌ద్ద‌ని మీడియా ప్ర‌తినిధుల‌కే స‌ల‌హాలు..సూచ‌న‌లు ఇస్తుండ‌టం గ‌మ‌నార్హం. అయితే సోష‌ల్ మీడియాలో చేయాల్సినంతా హ‌డావుడి చేస్తూనే ఇలా నిపాదిగా ఇద్ద‌రు నేత‌లు చెప్ప‌డం వారికే చెల్లుతోందంట‌.

వాస్త‌వానికి   2014 ఎన్నికల్లో అద్దంకిలో కరణం, గొట్టిపాటిల మధ్య పెద్ద రణమే సాగింది. 2019 ఎన్నికల నాటికి అనేక రాజ‌కీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. గొట్టిపాటి వైసీపీ నుంచి టీడీపీలోకి మారారు. తిరిగి అద్దంకి నుంచి పోటీ చేశారు. ఇక కరణం బలరామ్ మాత్రం అనుహ్యంగా చీరాల టీడీపీ టికెట్ ద‌క్కించుకుని ఆమాంచిపై విజ‌యం సాధించారు. అక్క‌డ అద్దంకిలో ర‌వికుమార్‌..ఇక్క‌డ బ‌ల‌రాం విజ‌యం సాధించ‌డంతో ఇద్ద‌రు నేత‌ల్లో సంతోషం నెల‌కొంది. ఆధిప‌త్య పోరు కూడా ముగిసింది.

ఎన్నిక‌ల‌కు ముందు కూడా ఇద్ద‌రు నేత‌లు త‌మ‌కున్న అనుచ‌ర‌వ‌ర్గంతో గెలుపుకు బాట‌లు వేసుకున్నారు. అయితే  మొన్నటి ఎన్నికల్లో చంద్రబాబు చొరవతో గెలుపు కోసం ఒకరికొకరు పరోక్షంగా సాయం చేసుకున్న ఈ ఇద్దరూ ఇపుడు సోషల్‌మీడియాలో మాటల తూటాలు పేల్చుతున్నారా?  అంటు టీడీపీ వ‌ర్గాల నుంచే అవుననే స‌మాధానం వ‌స్తోంది. తాజాగా మళ్లీ సోషల్‌మీడియాలో ఇద్దరి మధ్య వార్‌ మొదలైందని ప్రచారం  జోరుగా సాగుతోంది. ఇందుకు కొంత‌మంది ఉదాహార‌ణ‌లు కూడా చూపుతున్నారు. ఇటీవల అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికి చెందిన గ్రానైట్‌ క్వారీలపై విజలెన్సు వ‌రుస‌గా దాడులు చేస్తున్న విష‌యం తెలిసిందే.

ఆయ‌న వ్యాపారాలు దెబ్బ‌తింటుండ‌టంతో పార్టీ మారుతున్నార‌నే ప్ర‌చారం ప్ర‌కాశం జిల్లాలో జోరుగా సాగింది. క‌ర‌ణం పేరుతోనే ర‌వికుమార్ వైసీపీలోకి వెళ్తున్న‌ట్లుగా  కొన్ని పోస్టులు విప‌రీతంగా షేర్‌కావ‌డం వివాదాస్ప‌ద‌మైంది. ఈ ప్ర‌చారం వెనుక క‌ర‌ణంబ‌ల‌రాం వ్యూహం ఉన్న‌ట్లుగా ర‌వికుమార్  వ‌ర్గీయులు  బ‌లంగా న‌మ్మార‌ట‌. భావించారు.  ర‌వికుమార్ దీనికి కౌంట‌ర్‌గా బ‌ల‌రాం కూడా వైసీపీలోకి వెళ్తున్న‌ట్లుగా పుకార్లు రేపిన‌ట్లుగా ఆరోప‌ణ‌లు విన‌వ‌స్తున్నాయి.

ఇదే సందర్భంలో గొట్టిపాటి వైసీపీలో చేరుతున్నారన్న అంశంపై బలరామ్‌ పేరుతో సోషల్‌ మీడియాలో ఓ సెటైర్‌ వచ్చింది. ” బెదిరిస్తే పార్టీ మారడానికి మాకు రాళ్ల వ్యాపారం లేదు. మాకు ఇసుక వ్యాపారం లేదు, అందుకే పార్టీలు మారాల్సినఅవసరం లేదు‘‘ అంటూ కరణం ఫోటోతో సహా ఓ సెటైరిక్‌ పోస్టు చక్కర్లు కొడుతుండ‌గా,  గొట్టిపాటి పేరుతో   “ రాళ్ల వ్యాపారముంటే రాజీ పడాలా ? 20 ఏళ్ల నుంచి నిర్వహిస్తున్న క్వారీలపై పెట్టిన అక్రమ కేసులను న్యాయపరంగా ఎదుర్కొంటా! టీడీపీని మాత్రం వీడను. జై తెలుగుదేశం!‘’ అంటూ కౌంటర్ మ‌రో పోస్టు ఇప్పుడు సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది.  ఈ రెండు పోస్టులూ కరణం, గొట్టిపాటిలకు చెందిన సోషల్‌ మీడియా అకౌంట్లనుంచే పబ్లిష్ కావ‌డం గ‌మ‌నార్హం.

Read more RELATED
Recommended to you

Exit mobile version