Breaking : జాతీయ ఉత్తమ నటుడు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌

-

మూవీ లవర్స్‌ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న నేషనల్ ఫిలిం అవార్డ్స్‌ ఈవెంట్‌ మొదలైంది. న్యూఢిల్లీలోని నేషనల్ మీడియా సెంటర్‌లో విలేకరుల సమావేశంలో జ్యూరీ జాతీయ చలన చిత్ర పురస్కారాలను ప్రకటించారు. 2021 ఏడాదికిగాను చలనచిత్ర పురస్కారాలు ప్రకటించారు.

28 భాషల్లో 280 సినిమాలు వివిధ విభాగాల్లో పోటీపడ్డాయి. ఉత్తమ తెలుగు చిత్రంగా ఉప్పెన నిలిచింది. మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమాను నిర్మించింది. ఉత్తమ నటుడిగా అల్లు అర్జున్ నిలిచారు. తెలుగులో మొట్టమొదటి జాతీయ ఉత్తమ నటుడు స్టైలిష్ స్టార్ కావడం గమనార్హం. ఆర్ఆర్ఆర్, పుష్ప సినిమాలు వివిధ విభాగాల్లో అవార్డులు దక్కించుకొని దుమ్మురేపాయి. ఆర్ఆర్ఆర్ సినిమాకు ఏకంగా 6 అవార్డులు రాగా, పుష్ప సినిమాకు రెండు వచ్చాయి.

ఉత్తమ తెలుగు చిత్రం – ఉప్పెన,
ఉత్తమ నటుడు – అల్లు అర్జున్ (పుష్ప),
ఉత్తమ కొరియాగ్రఫీ – ప్రేమ్ రక్షిత్ (ఆర్ఆర్ఆర్),
ఉత్తమ స్టంట్ కొరియోగ్రాఫర్ – కింగ్ సోలోమన్ (ఆర్ఆర్ఆర్),
ఉత్తమ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ – కీరవాణి (ఆర్ఆర్ఆర్)
ఉత్తమ గీత రచయిత – కొండపొలం,
ఉత్తమ సంగీత దర్శకుడు – దేవిశ్రీ ప్రసాద్ (పుష్ప),
ఉత్తమ స్పెషల్ ఎఫెక్ట్ – శ్రీనివాస్ మోహన్ (ఆర్ఆర్ఆర్),
ఉత్తమ ప్రజాదరణ చిత్రం – ఆర్ఆర్ఆర్,
జాతీయ సమగ్రతా చిత్రం – ది కశ్మీర్ ఫైల్స్

Read more RELATED
Recommended to you

Exit mobile version