ఈ మధ్యకాలంలో చాలామంది మహిళలు ఇంటికి పరిమితం అయిపోవడం లేదు వివిధ మార్గాలని ఎంచుకుని డబ్బులు సంపాదిస్తున్నారు రోజు రోజుకీ చాలామంది ఆడవాళ్లు ఉద్యోగం చేస్తున్నారు. చదువు అయిపోయిన తర్వాత ఉద్యోగం చేసి ఆ తర్వాత పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నారు. మహిళలు అన్ని రంగాల్లోనూ దూసుకు వెళ్ళిపోతున్నారు.
ఆర్ధిక వ్యవహారాలలో కూడా నేర్పుగా మహిళలు డీల్ చేయడం జరుగుతోంది. కేవలం ఇంటి ఫైనాన్స్ కి పరిమితం కావడం లేదు డబ్బులని పెట్టుబడిగా కూడా పెడుతున్నారు. అయితే మహిళలు ఎక్కడ పెట్టుబడి పెడితే మంచిది అనే విషయాన్ని ఇప్పుడు చూద్దాం.
పొదుపుని పెట్టుబడిగా మార్చండి:
మహిళలు మీరు డబ్బులని ఆదా చేసుకోవాలన్నా మరింత లాభాలను పొందాలన్నా రిస్క్ లేని సురక్షితమైన పథకాలలో పొదుపు చేయండి. దీర్ఘకాలిక సంపదని సృష్టించడానికి పెట్టుబడి ఎంతో అవసరం. చాలా పథకాలు ఇప్పుడు మనకి అందుబాటులో ఉన్నాయి వాటిలో మీరు డబ్బులు పెడితే మంచిగా లాభాలని పొందొచ్చు. సెక్యూరిటీ స్కీమ్ లో మ్యూచువల్ ఫండ్లలో చిన్న మొత్తాలలో క్రమం తప్పకుండా పెట్టుబడి పెడితే ఎక్కువ లాభం పొందొచ్చు.
ఆర్థిక అక్షరాస్యత ముఖ్యం:
మన దేశంలో కేవలం 21 శాతం మంది మహిళలు మాత్రమే ఆర్థిక అక్షరాస్యులు. గృహ బడ్జెట్ ని ప్లాన్ చేయడం మొదలు మీ డబ్బును ఎలా పెట్టుబడి పెట్టాలి ఎలా ఆదా చేసుకోవాలి ఇలా ప్రతి విషయాన్ని మీరు తెలుసుకుని ఉండాలి. చాలా విషయాల్ని ఇంటర్నెట్లోనే మీరు తెలుసుకోవచ్చు ఎక్కడికి వెళ్లాల్సిన పని కూడా లేదు.
బీమా కి ప్రాధాన్యతని ఇవ్వడం మర్చిపోకండి:
ఆరోగ్య బీమా జీవిత బీమా వంటి పాలసీలను తీసుకోవచ్చు కాబట్టి మహిళలు మీరు సంపాదించే వాటిని ఈ విధంగా మీరు పొదుపు చేసినా ఖర్చు చేసిన మంచిదే… డబ్బులు ని ఆదా చేయాలనుకుంటే ఇలా తప్పక అనుసరించండి అనేక ప్రయోజనాలు కలుగుతాయి తప్ప ఎటువంటి ఇబ్బంది రాదు.