మీది నిజమైన ప్రేమోనా ఇలా తెలుసుకోచ్చు..

-

ప్రేమలో వున్నా కూడా కొన్ని కొన్ని సార్లు ఆ ప్రేమ నిజమైనదా కాదా అనే సందేహం కలుగుతుంది. అయితే నిజమైన ప్రేమో కాదో తెలియకుండా సర్వహక్కులు మీ పార్టనర్ కి ఇచ్చేసి అణిగిమణిగి ఉండడం సరైంది కాదు. ఒకవేళ కనుక మీది నిజమైన ప్రేమ కాదు అంటే చాలా నష్టపోవాల్సి ఉంటుంది.

love

అందుకని తప్పకుండా మీ ప్రేమ నిజమైనదా కాదా అనేది మీకు తెలియాలి. అయితే నిజంగా నిజమైన ప్రేమ అని ఎలా తెలుసుకోవచ్చు..? అలా తెలుసుకోవడం వీలవుతుందా..? అవును కచ్చితంగా నిజమైన ప్రేమని మనం తెలుసుకోవచ్చు. అది ఎలా అనేది ఇప్పుడు మనం చూద్దాం.

ఒకరి లో ఒకరిని చూసుకోవడం కాదు

మీరు ప్రేమలో ఉన్నారని అనుకుంటున్నారు అంటే అది ప్రేమ కాదు. నిజంగా మీరు ప్రేమలో ఉన్నారంటే.. మిమ్మల్ని మీరు ఇషపడాలి. అలానే మీరు ఎడ్జస్ట్ అవ్వకుండా కంఫర్టబుల్ గా ఉండాలి. నిజమైన ప్రేమలో ఇది మీకు కచ్చితంగా కనబడుతుంది. అంతే కానీ ఒకరి లో ఒకరిని చూసుకోవడం కాదు.

ట్రూ లవ్ అంటే డిమాండ్ చేయడం కాదు

నిజమైన ప్రేమ అంటే మిమ్మల్ని మారమని ఎవరు చెప్పరు. నిజంగా మీరు మీ పార్ట్నర్ ప్రేమిస్తే వాళ్లని మారమని మీరు ఎప్పుడూ కూడా అడగకూడదు. మీరు రిలేషన్షిప్ లో ఉన్నది ఇద్దరికిద్దరూ నచ్చారనే కదా..? కాబట్టి ఎప్పుడూ కూడా ఒకరికొకరు మారమని చెప్పకూడదు.

మీరు మీలా ఉండడం

మీరు అందంగా లేకపోయినప్పుడు వాళ్ల దగ్గర ఉండడంలో ఇబ్బంది పడడం లేదా మేకప్ వేసుకుని మాత్రమే వాళ్ళ దగ్గర కూర్చోవడం… అందంగా కనపడాలని మీరు ఎక్కువగా కష్టపడడం ఇలాంటివి నిజమైన ప్రేమ లో ఉండవు.

నాచురల్ గా నిజమైన ప్రేమ వస్తుంది

నిజమైన ప్రేమలో నటన ఉండదు. అది స్వతహాగా వస్తుంది. మీరు నిజంగా నిజమైన ప్రేమ లో ఉంటే దీనిపై కూడా మీకు ప్రశ్నలు కలగవు.

ప్రేమ ను ఇవ్వడం

నిజమైన ప్రేమలో ప్రేమ ఇవ్వాలి. ఒకరికి ఒకరు తోడై, నీడై ప్రేమని పంచుకోవాలి. బాధలో ఉన్నప్పుడు అర్థం చేసుకోవాలి. జీవితంలో ధైర్యం, భరోసా ఇచ్చి ఆనందంగా చూసుకోవాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version