ఏ బ్యాంక్ అకౌంట్‌కు మీ ఆధార్ నెంబర్ లింక్ అయ్యిందో ఇలా తెలుసుకోచ్చు..!

-

మనకి వుండే డాక్యుమెంట్స్ లో ఆధార్ కార్డు చాలా ముఖ్యమైంది. ప్రభుత్వ పథకాలు మొదలు రేషన్ సరుకులు తీసుకోవడానికి ఆధార్ తప్పక ఉండాలి. అయితే ఏదైనా పథకాలకు చెందిన నిధులు ఆధార్ నెంబర్‌కు లింకైన బ్యాంక్ అకౌంట్లలో జమ చేస్తుంటారు అధికారులు.

 

కాబట్టి బ్యాంక్ అకౌంట్‌కు ఆధార్ నెంబర్ లింక్ చేయడం తప్పని సరిగా మారిపోయింది. ఒక బ్యాంక్ లో కంటే ఎక్కువ బ్యాంక్ ఖాతాలు వున్నవాళ్లు ఏ బ్యాంక్ తో లింక్ అయ్యిందో తెలియక ఇబ్బంది పడతారు. అయితే ఇలా చూస్తే తెలుసుకోవచ్చు. ఇక పూర్తి వివరాల లోకి వెళితే.. యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా ఈ సేవల్ని అందిస్తోంది. మీ ఆధార్ నెంబర్‌కు మొబైల్ నెంబర్ లింక్ అయి ఉంటేనే ఈ వివరాలు తెలుస్తాయి గమనించండి.

దీని కోసం ముందుగా https://uidai.gov.in/ వెబ్‌సైట్ ఓపెన్ చేయండి.
నెక్స్ట్ హోమ్ పేజీలో Aadhaar Services పైన క్లిక్ చేసి… Check Aadhaar Bank Linking Status లింక్ పైన క్లిక్ చేయండి. ఇప్పుడు ఒక కొత్త పేజీ ఓపెన్ అవుతుంది.
ఇప్పుడు ఆధార్ నెంబర్ లేదా వర్చువల్ ఐడీ ఎంటర్ చేసి…సెక్యూరిటీ కోడ్ ని కూడా ఎంటర్ చేయండి.
ఆ తర్వాత Send OTP పైన క్లిక్ చేయండి. మీకు ఓటీపీ వస్తుంది.
ఫైనల్ గా ఓటీపీ ఎంటర్ చేసి Submit పైన క్లిక్ చేయాలి.

ఇక్కడ మీ ఆధార్ నెంబర్ ఏ బ్యాంకు అకౌంట్‌కు లింక్ అయ్యిందా లేదా అనే వివరాలు కనిపిస్తాయి. అలానే మీ ఆధార్ నెంబర్ చివరి నాలుగు అంకెలు, బ్యాంక్ లింక్ స్టేటస్, ఎప్పటి నుంచి బ్యాంక్ అకౌంట్‌కు ఆధార్ నెంబర్ లింక్ అయింది, ఏ బ్యాంకుతో ఆధార్ నెంబర్ లింక్ అయ్యింది అనేవి క్లియర్ గా ఉంటాయి. కనుక ఇలా ఈ స్టెప్స్ తో సులువుగా తెలుసుకోచ్చు.

Read more RELATED
Recommended to you

Exit mobile version