ఏపీ సచివాలయంలో భారీ అగ్నిప్రమాదం సంభవించిన విషయం తెలిసిందే. విషయం తెలుసుకున్న సీఎం చంద్రబాబు అగ్ని ప్రమాదం జరిగిన ప్రదేశాన్ని స్వయంగా పరిశీలించారు. రెండో బ్లాక్‌లో జరిగిన ప్రమాదం తీరుపై అధికారుల నుంచి ముఖ్యమంత్రి వివరాలు అడిగి తెలుసుకున్నారు.
అయితే, ప్రమాదానికి గల కారణాలను సీఎం చంద్రబాబుకు సీఎస్ విజయానంద్, డీజీపీ హరీష్ కుమార్ గుప్తా, ఫైర్ డీజీ మాదిరెడ్డి ప్రతాప్, జీఏడీ సెక్రెటరీ ముఖేష్ కుమార్ మీనా వివరించారు. కాగా, ఫైర్ సిబ్బంది ఇప్పటికే మంటలను అదుపులోకి తీసుకురాగా.. బ్యాటరీల రూంలో అగ్నిప్రమాదం సంభవించినట్లు అధికారులు సీఎంకు వివరించారు. ఆస్తి నష్టంపై కూడా సీఎం ఆరా తీసినట్లు తెలిసింది.
సచివాలయంలో జరిగిన అగ్ని ప్రమాదాన్ని స్వయంగా పరిశీలించిన సీఎం చంద్రబాబు..
రెండో బ్లాక్ లో జరిగిన ప్రమాదం తీరుపై అధికారుల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్న ముఖ్యమంత్రి
ప్రమాదాన్ని గల కారణాలని సీఎంకి వివరించిన సీఎస్ విజయనంద్, డీజీపీ హరీష్ కుమార్ గుప్తా, ఫైర్ డీజి మాదిరెడ్డి ప్రతాప్,… https://t.co/NKLBFIbMs9 pic.twitter.com/OSPDCJ2sNH
— BIG TV Breaking News (@bigtvtelugu) April 4, 2025