బాణాసంచా ఫ్యాక్టరీలో పేలుడు.. ఐదుగురు దుర్మరణం

-

బాణాసంచా ఫ్యాక్టరీలో పేలుడు సంభవించిన ఘటనలో ఐదుగురు దుర్మరణం చెందారు. ఈ ప్రమాదం తమిళనాడులోని మధురై జిల్లాలో చోటుచేసుకుంది. ఉసిలంబట్టి సమీపంలోని ప్రైవేట్ ఫైర్‌క్రాకర్స్‌ ఫ్యాక్టరీలో ఇవాళ పేలుడు సంభవించింది.

ఈ ఘటనతో ఫ్యాక్టరీలో పని చేస్తున్న అమ్మవాసి, వల్లరసు, గోపి, వికీ, ప్రేమ మృతి చెందారు. మరో పది మంది గాయపడ్డారు. వారిని సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు. పేలుడు ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఫైర్‌క్రాకర్స్‌ ఫ్యాక్టరీ వలైయప్పన్‌కు చెందిందని పోలీసులు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version