హైదరాబాద్‌లోని పురానాపూల్‌లో గల ఓ భవనంలో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. మూసీ నది సమీపంలోని ఓ గోదాంలో మంటలు ఎగిసిపడుతున్నాయి. ప్రమాదం జరిగిన గోదాంలో కూలర్లు ఉన్నట్లు తెలుస్తోంది. అయితే.. గోదాంలో భారీగా మంటలు ఎగిసిపడుతుండటంతో.. ఆరు ఫైరింజన్లతో అగ్నిమాపక సిబ్బంది మంటలు ఆర్పుతున్నారు. భారీగా మంటలు ఎగిసిపడుతున్నాయి. ఆ ప్రాంతంలో దట్టమైన పొగ అలుముకుంది. అగ్నిప్రమాదం ఘటనతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు.
ఇదిలా ఉంటే.. ఇటీవల హైదరాబాద్ రాంగోపాల్ పేట్ లో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. డెక్కన్ నైట్ వేర్ స్టోర్ లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో దట్టమైన పొగ కమ్మేసింది. అగ్నిప్రమాదం జరిగిన చోట కొందరు చిక్కుకున్నారు. వారిని రక్షించేందుకు సహాయక చర్యలు చేపట్టి అగ్నిమాపక సిబ్బంది కాపాడారు. భారీ క్రేన్ సాయంతో ముగ్గురిని కిందకు తీసుకువచ్చారు. దట్టమైన పొగ కమ్ముకోవడంతో మంటలను అదుపు చేయడానికి చాలా టైమ్ పడుతోంది. షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగినట్లు చెబుతున్నారు. ప్రమాదంలో దుకాణంలో ఉన్న వస్తువులు పూర్తిగా కాలిపోయాయి. అంతేకాకుండ ముగ్గురు కూలీలు ఈ ప్రమాదంలో సజీవ దహనమయ్యారు.