దక్షిణాఫ్రికాలోని చారిత్రక దుర్బాన్ మసీదులో అగ్నిప్రమాదం సంభవించింది. ఈ మసీదుకు 139 ఏళ్ల చరిత్ర ఉంది. ప్రమాదంతో అగ్నిమాపకశాఖ అధికారులు హుటాహటిన తరలివచ్చి మంటలను అదుపు చేశారు. ప్రార్థనలకు ముందు సంభవించిన అగ్నిప్రమాదంలో మసీదులోని కర్టెన్లు కాలిపోయాయి. అగ్నిప్రమాదం జరగగానే మసీదులో ఉన్న కార్మికులు, వారి కుటుంబాలను ఖాళీ చేయించారు.
దుర్బాన్ సిటీ సెంటరులో ఉన్న ఈ చారిత్రక మసీదులో ఒకే సారి 7వేల మంది ప్రార్థనలు చేయొచ్చు. అయితే.. మసీదు ఆవరణలో ఉన్న సిబ్బంది ఫ్లాట్లలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల అగ్నిప్రమాదం జరిగి ఉంటుందని దక్షిణాఫ్రికా ముస్లిమ్ నెట్ వర్క్ ఛైర్మన్ ఫైజల్ సులీమాన్ చెప్పారు.