చరిత్రలోనే తొలిసారి.. వాట్సాప్‌లో కేసు విచారణ..

-

నేటి సమాజంలో టెక్నాలజీ పెరిగిపోతున్న విషయం తెలిసిందే. అయితే.. ఇప్పుడు ప్రతి ఇంట్లో స్మార్ట్‌ ఫోన్‌ ఉంటునే ఉంది. వాట్సాప్‌ వినియోగించని స్మార్ట్‌ ఫోన్‌ కూడా ఉండనే ఉండదు అనడంలో ఆతిశయోక్తి లేదు. టెక్నాలజీని వాడకం ఇప్పుడు అన్ని రంగాల్లో కొనసాగుతోంది. విదేశాల్లో ఇప్పటికే వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా కేసులు విచారణ చేస్తున్నారు.

కరోనా నేపథ్యంలో భారత్‌లో కూడా ఈ విధంగా వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా కేసులు విచారణ చేపట్టారు. అయితే.. మద్రాస్‌ హైకోర్టు మరో ముందడుగు వేసి.. ఏకంగా వాట్సాప్‌ ద్వారా కేసుల విచారించి.. అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. చరిత్రలోనే తొలిసారి ఓ న్యాయమూర్తి వాట్సాప్‌ ద్వారా కేసును విచారించారు. ఆదివారం సెలవు రోజున కేసు విచారణ సాగింది. తమిళనాడులో ధర్మపురి జిల్లాలో అభీష్ట వరదరాజస్వామి రథయాత్ర జరిగింది. అర్ధరాత్రి జరిగిన వేడుకల్లో రథానికి విద్యుత్‌ తీగలు తగిలి అగ్నిప్రమాదం చోటు చేసుకుంది.

ఘటనలో 11 మంది భక్తులు ప్రాణాలను మరణించగా.. మరో 17 మంది భక్తులు గాయపడ్డారు. ఈ క్రమంలో రథయాత్రలపై అధికారులు కఠిన చర్యలు తీసుకుంటున్నారు. ధర్మపురి జిల్లాలోని అభిష్ఠ వరదరాజ స్వామి ఆలయంలో సోమవారం రథయాత్ర జరగాల్సి ఉండగా.. కొన్ని రోజుల క్రితం రథయాత్రను నిలిపివేయాలని ఓ ఇన్‌స్పెక్టర్‌ ఆదేశాలు జారీచేశారు. అభీష్ట వరదరాజ స్వామి ఆలయంలో సోమవారం రథయాత్ర జరగాల్సి ఉంది.

దీంతో స్వామి వారి దేవాలయం అనువంశిక ధర్మకర్త పీఆర్‌ శ్రీనివాసన్‌ కోర్టును ఆశ్రయించారు. ఈ కేసుపై సత్వరమే విచారణ చేపట్టాలని కోరారు. రథయాత్ర నిర్వహించకపోతే.. దైవం ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుందంటూ అభ్యర్థించారు. దీంతో వివాహ వేడుకలో పాల్గొన్న జస్టిస్‌ జీఆర్‌ స్వామినాథన్‌ వాట్సాప్‌లోనే విచారణ చేపట్టారు. పిటిషన్‌ విజ్ఞప్తి మేరకు నాగర్‌ కోయిల్‌ నుంచి రిట్‌ పిటిషన్‌ను అత్యవసర విచారణ చేపట్టాల్సి వచ్చిందని న్యాయమూర్తి పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version