నేలమీద జీవించడం నేర్చుకున్న చేపలు.. అధ్యయనాలు ఏం అంటున్నాయంటే..!

-

చేపల అంటే.. నీళ్లల్లో ఉండాలి..పక్షలు అంటే గాల్లో ఎగరాలి.. ఆడపిల్లలు అంటే వంటగదికే పరిమతమవ్వాలి.. ఇవ్వన్నీ ఒకప్పటి మాటలు.. మారాయ్.. రోజులు మారాయ్.. వంటగది నుంచి.. విమానాలు నడిపే వరకూ ఆడపిల్లలు ఎదిగారు.. చేపలేమన్నా తక్కువా..నీళ్లు లేకపోతే విలవిలలాడిపోయేవి.. కానీ.. ఒడ్డుకు చేరిన చేపలు.. నీళ్లు లేకుండా బతకడం నేర్చుకున్నాయి. అవును.. ఇప్పుడు ఆ రకం చేపలు.. నీళ్లు లేకపోయినా..బతికేస్తున్నాయట.. భలే వింతగా ఉంది కదా..!
కొన్ని సంవత్సరాల క్రితం, శాస్త్రవేత్తలు ఒక పరిశోధన చేసారు.. ఆ పరిశోధనలో ఒక జాతి చేప నీటిని వదిలి భూమిపై నివసించడం ప్రారంభించినట్లు తేలింది.. ఈ ప్రత్యేక జాతి చేప పేరు ‘బ్లెన్నీస్’. బ్లెన్నీస్ జాతుల చేపలు చాలాసార్లు సముద్రం నుండి బయటకు వచ్చి భూమిపై ఎక్కువ సమయం గడిపాయని, తద్వారా అవి క్రమంగా భూమిపై జీవించడం నేర్చుకున్నాయని శాస్త్రవేత్తలు తెలిపారు.. ఇప్పుడు ఈ జాతికి చెందిన అనేక రకాల చేపలు ఉన్నాయి. ఇవి నీటిని పూర్తిగా మరచిపోయి.. భూమిలోనే తమ శాశ్వత నివాసంగా చేసుకున్నాయట
భూమిలోపల గుంతలు తీసుకుని తమ స్థిరనివాసాన్ని ఏర్పరచుకున్నాయి. నీటిని మరిచి, నేలపై జీవించే కళను ఈ చేపలు నేర్చుకున్నాయి. ఈ జాతి చేపపై శాస్త్రవేత్తలు చేసిన పరిశోధన ఫలితాలు ఫంక్షనల్ ఎకాలజీలో ప్రచురించబడింది. ఈ జాతికి చెందిన అనేక చేపలు ఉన్నాయని.. వీటిల్లో కొన్ని మాత్రమే సముద్రంలో నీటి అడుగున జీవిస్తున్నాయి. కానీ ఎక్కువ రకాలు తమ జీవితాన్ని భూమి మీదనే ఏర్పరచుకున్నాయని శాస్త్రవేత్తలు తెలిపారు.
అయితే ఈ చేపలు తన జీవితంలో ఈ ముఖ్యమైన మార్పును ఎందుకు కోరుకున్నాయి.. ఎలా నీటిని విడిచి నేలమీదకు చేరుకున్నాయనే విషయం పూర్తి స్థాయిలో తెలుసుకోవడానికి శాస్త్రవేత్తలు ప్రయత్నిస్తున్నారు. శాస్త్రవేత్తల ప్రకారం.. బ్లెన్నీస్ చేపలు సముద్రపు అలలతో పాటు.. కొట్టుకుని వచ్చి.. ఒడ్డుకు చేరుకుంటున్నాయి… ఇలా ఒడ్డుకు చేరుకునే సమయంలో.. కొన్ని చేపలు మరణిస్తాయి. మరికొన్ని చేపలు.. తాము నేలపై జీవించడాన్ని ‘ప్రాక్టీస్’ చేశాయి. అలా కాలక్రమంలో బెన్నీస్ చేపలు సముద్రాన్ని విడిచి నేలమీదనే జీవించేలా తమని తాము తీర్చిదిద్దుకున్నాయటయ. మొత్తానికి చేపలు అలా భూమిపైన ఉంటున్నాయి. ప్రాక్టీస్ చేస్తే ఏదైనా చేసేయచ్చండోయ్..!
-Triveni Buskarowthu

Read more RELATED
Recommended to you

Exit mobile version