పవన్ ఎఫెక్ట్.. ఐదు జిల్లాల్లోనే వైసీపీకి రిస్క్..!

-

నెక్స్ట్ మరొకసారి సత్తా చాటి అధికారం దక్కించుకోవాలని వైసీపీ భావిస్తుంది. ఇప్పటికీ తమ బలం తగ్గలేదని, టీడీపీ పని అయిపోయిందని, ప్రజల సపోర్ట్ తమకే ఉందని జగన్ భావిస్తున్నారు. తాను ప్రజలకు మంచి చేస్తున్నానని, కాబట్టి ప్రజలు తమతోనే ఉంటారని అనుకుంటున్నారు. మళ్ళీ తనకు అధికారం దక్కుతుందని భావిస్తున్నారు. అయితే రాష్ట్రంలో వాస్తవ పరిస్తితులని గమనిస్తే వైసీపీకి ధీటుగా టీడీపీ పికప్ అవుతుంది.

కాకపోతే పూర్తి స్థాయిలో వైసీపీని దాటి టీడీపీకి ఆధిక్యం వచ్చే పరిస్తితి కనిపించలేదు. ఈ క్రమంలోనే జనసేనతో పొత్తు ఉంటే వైసీపీకి చెక్ పెట్టవచ్చని ఎప్పటినుంచో ప్రచారం ఉంది. కానీ అధికారికంగా పొత్తుపై ఎలాంటి సమాచారం లేదు. తాజాగా మాత్రం పవన్‌ని చంద్రబాబు కలవడం, ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం కలిసి పోరాటం చేస్తామని చెప్పడంతో..అందరికీ క్లారిటీ వచ్చేసింది..టీడీపే-జనసేనలు కలిసి ఎన్నికలకు వెళ్లబోతున్నాయని, పైకి పొత్తు గురించి చెప్పకపోయినా.. వారి కలవడం బట్టి చూస్తే ఖచ్చితంగా పొత్తు ఫిక్స్ అని చెప్పొచ్చు.

అయితే ఇంతకాలం టీడీపీ-జనసేన పొత్తు ఉండకూడదని వైసీపీ నేతలు ఏదొకవిధంగా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తూ వచ్చారు. దమ్ముంటే పవన్ 175  సీట్లలో పోటీ చేయాలని సవాళ్ళు చేస్తూ వచ్చారు. కానీ అనూహ్యంగా బాబు-పవన్ కలిశారు. ఇక టీడీపీ-జనసేన కలవడం వల్ల ప్రధానంలో విశాఖ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణ, గుంటూరు జిల్లాల్లో వైసీపీకి పెద్ద డ్యామేజ్ ఉంటుంది. గత ఎన్నికల్లో ఈ రెండు పార్టీలు విడిగా పోటీ చేయడం వల్ల ఓట్లు చీలిపోయి వైసీపీకి ప్లస్ అయింది.

కానీ వైసీపీకి పెద్ద దెబ్బ. ఐదు జిల్లాల్లో కలిపి 82 సీట్లు ఉన్నాయి. అంటే 88 మ్యాజిక్ ఫిగర్‌కు దగ్గరయ్యే సీట్లు ఈ ఐదు జిల్లాల్లోనే ఉన్నాయి. టీడీపీ-జనసేన ప్రభావం వల్ల వైసీపీకి 50-60 సీట్లలో నష్టం జరిగే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. మొత్తానికైతే టీడీపీ-జనసేన పొత్తు వైసీపీకి నష్టమే.

Read more RELATED
Recommended to you

Exit mobile version