సీఎం ఎన్టీఆర్ అంటూ వెలసిన ఫ్లెక్సీలు… ఏకంగా అమెరికాలోనే

-

జూనియర్ ఎన్టీఆర్ కు ఫ్యాన్ ఫాలోయింగ్ విపరీతంగా ఉన్న సంగతి తెలిసిందే. నందమూరి కుటుంబం నుంచి వచ్చిన జూనియర్ ఎన్టీఆర్ కు రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఇతర దేశాల్లో కూడా ఫాన్స్ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే అమెరికాలోని డల్లాస్ లో జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు రచ్చ చేశారు.

ntr war 2
ntr war 2

సీఎం జూనియర్ ఎన్టీఆర్ అంటూ ఫ్లెక్సీలను తెరపైకి తీసుకువచ్చారు. సీఎం సీఎం అంటూ జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ నినాదాలు కూడా చేశారు. అమెరికాలోని డల్లాస్ లో వార్ 2 సినిమా రిలీజ్ సందర్భంగా ఫ్యాన్స్ ఈ సందడి చేశారు. ఎన్టీఆర్ ఫోటోలతో కూడిన ప్లకార్డులు పట్టుకొని థియేటర్ ముందు సందడి చేశారు జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్.

Read more RELATED
Recommended to you

Latest news