కారు వర్సెస్ కమలం: జనగాం పంచాయితీ!

-

బండి సంజయ్ పాదయాత్ర జనగాం నియోజకవర్గానికి చేరుకున్న విషయం తెలిసిందే…అయితే బండి యాత్రకు ప్రజల నుంచి మంచి స్పందన వస్తుంది..ఇక ఈ అంశాన్ని డైవర్ట్ చేయడానికి టీఆర్ఎస్ నేతలు నానా తిప్పలు పడుతున్నారు. పాదయాత్రకు ప్రజల నుంచి మంచి స్పందన రానివ్వకుండా చేసేందుకు తెగ కష్టపడుతున్నారు. ఇక పాదయాత్ర జనగాం నియోజకవర్గానికి చేరుకున్న నేపథ్యంలో అక్కడ స్థానికంగా ఉన్న టీఆర్ఎస్ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి..పాదయాత్రని సక్సెస్ కాకుండా చేయాలని విఫలయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది

అసలు బండి యాత్ర ఎక్కడ చేస్తే అక్కడ టీఆర్ఎస్ శ్రేణులు ఏదొక అలజడి సృష్టించి ప్రజలని డైవర్ట్ చేయడానికే చూస్తున్నట్లు తెలుస్తోంది. మొన్నటికి మొన్న దేవరుప్పల మండలంలో బండి పాదయాత్రపై టీఆర్ఎస్ శ్రేణులు రాళ్ళతో దాడి చేశారు. దీనికి బీజేపీ శ్రేణులు తీవ్రంగాగానే ప్రతిఘటించారు. ప్రస్తుతం జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి.. బండి సంజయ్ కు సవాల్ విసురుతూ పెట్టిన హోర్డింగ్ తో పొలిటికల్ హీట్ మరింత పెరిగింది.

జనగాంలో బీజేపీ శ్రేణులు కట్టిన ఫ్లెక్సిలని చింపేసిన టీఆర్ఎస్ శ్రేణులు… బండి సంజయ్ జనగామలో అడుగుపెట్టాలంటే నీతి ఆయోగ్ సిఫార్సు చేసిన నిధులను తీసుకురావాలని ఎమ్మెల్యే ముత్తిరెడ్డి సవాల్ చేస్తూ ఫ్లెక్సీ పెట్టారు. కేసీఆర్ నేతృత్వంలో అమలవుతున్న పథకాలు బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఉన్నాయా? లేవా? చెప్పాలని డిమాండ్ చేశారు.

అయితే ఎమ్మెల్యే ముత్తిరెడ్డికి బీజేపీ కూడా గట్టి కౌంటర్లు ఇస్తుంది…రాష్ట్రానికి కేంద్రం ఇచ్చిన నిధులకు సంబంధించిన ఫ్లెక్సీలని కడుతున్నారు. ఇక ఎమ్మెల్యే ముత్తిరెడ్డిపై …బీజేపీ జనగామ జిల్లా అధ్యక్షుడు దశమంతరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలు నీతి అయోగ్ గురించి తెలుసా? అని ముత్తిరెడ్డికి కౌంటర్ ఇచ్చారు. కేంద్రం ఇచ్చిన నిధులతో ఫామ్ హౌస్ కు రోడ్డు వేసుకున్న ముత్తిరెడ్డి…సవాల్ విసరడం విడ్డూరంగా ఉందని ఫైర్ అయ్యారు. కేంద్రం ఇచ్చిన నిధులపై బహిరంగ చర్చకు సిద్ధమని సవాల్ విసిరారు. మొత్తానికి జనగాంలో టీఆర్ఎస్-బీజేపీల మధ్య చిన్నపాటి వార్ నడుస్తోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version