ఐసెట్ లో మంచి మార్కులు రావాలంటే ఈ టిప్స్ పాటించాలి..

-

ఇప్పుడు దేశ వ్యాప్తంగా పోటీ పరీక్షలు జరుగుతున్నాయి..ఇప్పటికే పలు పరీక్షలు జరిగాయి. ఐసెట్ పరీక్షలు మరి కొద్ది రోజుల్లో జరగనున్నాయి.ఈ పరీక్షల్లో మంచి మార్కులను సంపాదించడం చాలా సులువు అని నిపుణులు అంటున్నారు..ఎలా చదివితే మంచి మార్కులు వస్తాయి అనే విషయం గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..

 

అర్ధమేటిక్స్ అండ్ రెజైనింగ్ పైన ప్రత్యేక దృష్టి సారించాలి. మేథమెటిక్స్లో బేసిక్స్ మరియు షాట్ కట్స్ విధానంపైన దృష్టిపెట్టి ప్రాక్టీస్ చేస్తే ఎగ్జామ్ హాల్ లో టైం సేవ్ అవుతుంది. సమయం ఎక్కువగా తీసుకునే కమ్యూనికేషన్ ఎబిలిటీ సబ్జెక్ట్ ను పరీక్షలో చివర్లో రాస్తే మంచిది. అయితే ప్రతి ప్రశ్నకు ఎంత సమయం ఇస్తామన్నదే ముఖ్యం..కొన్ని టిప్స్ పాటిస్తే మంచి మార్కులు రావడం పక్కా..

మాములుగా ఈ ఐసెట్ 200 మార్కులకు పేపర్ ఉంటుంది. పరీక్షా సమయం 150 నిమిషాలు. ఇందులో సెక్షన్ 1 సెక్షన్ 2 సెక్షన్ 3 ఉంటాయి. సెక్షన్ 1లో లాజికల్ రీజనింగ్, సెక్షన్ 2లో మ్యథ్స్, సెక్షన్ 3లో వెర్బల్ ఎబిలిటీ ఉంటాయి. ఇవి కూడా వివిధ మోడళ్లను అనుసరించి ఉంటాయన్నది గుర్తుంచుకోవాలి. ఇక సెక్షన్ ఒకటి నుంచీ లాజికల్ రీజనింగ్ ఉంటుంది. ఇందులో డేటా సఫిషియన్సి, 1 నుంచీ 20 ప్రశ్నలు ఉంటాయి. ఇవి కాస్త టఫ్. తర్వాత నంబర్ సిరీస్ అనాలజీ నుంచీ 15 ప్రశ్నలు వస్తాయి.వీటిలో కనీసం 10 మార్కులు సులువుగా రాయొచ్చు.

ఫెటన్ సిరీస్, అనాలజీ నుంచీ కూడా ఇదే విధంగా ఉంటుంది. తర్వాత ఆడ్ మేన్ అవుట్ నుంచి పది మార్కులకి ప్రశ్నలు ఉంటాయి. అలాగే కోడింగ్ డి కోడింగ్ నుంచీ కూడా 10 మార్కులు వస్తాయి. డేటా అనాలసిస్ వరకూ 10 మార్కులు. ఇక బ్లడ్ రిలేషన్స్, డైరెక్షన్స్, క్లాక్స్, కేలండర్స్ వరకూ అన్నీ ఊడా 15 మార్కులకు కవర్ అవుతాయి. ఇక సెక్షన్ 2లో మ్యాథ్స్ ఉంటుంది. అర్థమెటిక్ 35 ప్రశ్నలు, ప్యూర్ మ్యాథ్స్ 10 మార్కులు, స్టాటస్టిక్స్ అండ్ ప్రొబబిలిటీ నుంచీ 10 మార్కులకి సంబంధించిన ప్రశ్నలు వస్తాయి..వీటిని కరెక్ట్ గా చదివితే 55 మార్కులకు 40 మార్కులను సులువుగా పొందవచ్చు..

సెక్షన్ 3 నుంచీ వెర్బల్ ఎబిలిటీ నుంచీ ఉంటాయి. వీటిలో వొకాబులరీ, రీడింగ్ పేసేజ్, మొత్తం 30 ప్రశ్నలు ఉంటాయి. అంటే vocabulary నుంచి 15, reading comprehension నుంచి 20 మార్కుల ప్రశ్నలు వస్తాయి. తర్వాత ఫంక్షనల్ గ్రామర్, 20 ప్రశ్నలు, కంప్యూటర్ బిజినెస్ టెర్మినాలజీ నుంచీ 20. మొత్తం కలిపి 35 ప్రశ్నలు ఉంటాయి.వీటిని పక్కాగా టచ్ చేస్తే మంచి మార్కులు రావడం గ్యారంటీ.

ఇక సమయాన్ని ఎలా మ్యానెజ్ చేసుకొవాలి అనేది చూస్తే..ప్రధానం సెక్షన్ 1 కి 50 నిమిషాలు సమయం ఇవ్వాలి. తర్వాత సెక్షన్ 2 కి 60 నిమిషాలు ఇవ్వాలి. తర్వాత ఇంగ్లిష్ కి 30 నిమిషాలు ఇవ్వాలి. అలాగే మిగతా అంతా కవర్ చేయడానికి 10నిమిషాలు సరిపోతాయి. సెట్ పరీక్షకు ఎటువంటి నెగిటివ్ మార్కింగ్ లేదు. ఇది విద్యార్ధులకు చాలా పెద్ద అడ్వాంటేజ్. కాబట్టి మీ మొత్తం ఎంపికలు అయిపోయిన తర్వాత చివరి పది నిమిషాలు ఏదో ఒక ప్రశ్నకి.. సమాధానం ఇచ్చే వదిలేయాలి. ఐసెట్‌ పరీక్షకు ఎలాంటి నెగిటివ్‌ మార్కింగ్ లేదు.

మొదటి 5 నిముషాల్లో క్వశ్చన్‌ పేపర్‌ను పూర్తిగా చదివి..క్విక్‌ ఆన్సర్స్‌ మార్క్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఏ ప్రశ్నలకు ఎంత టైం కేటాయించాలి అన్న విషయం విద్యార్థులకు అర్ధం అవుతుందంటున్నారు. మీకు వచ్చిన సమాధానాలు అన్ని పూర్తి చేసిన తర్వాతే.. మిగిలిన వాటికి ఆన్సర్స్ రాస్తే అత్యధిక మార్కులు సాధించే అవకాశం ఉంటుందంటున్నారు.సాధ్యమైనంతలో ఆఖరి 15 నిమిషాలు ..తప్పులు సరిదిద్దుకోవటంలో కేటాయించాలంటున్నారు. పరీక్షకు ముందు ఎలాంటి కొత్త టాపిక్స్ జోలికి వెళ్ళకూడదంటున్నారు. బేసిక్ మ్యాథమెటిక్స్ మీద షార్ట్‌కట్స్ ఎక్కువగా నేర్చుకోవాలంటున్నారు. ముఖ్యంగా ఓల్డ్ పేపర్స్ రివిజన్ బాగా సహాయపడుతుందన్నారు.. టైం పెట్టుకొని పాత పేపర్ పైన ప్రాక్టీస్‌ చేస్తే బాగుంటుంది..ఒకవేళ అవే పరీక్షలో వచ్చిన సులువుగా ఉంటుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version