ప్రపంచ ప్రఖ్యాత కంపెనీ అయిన ఫోర్డ్ మోటార్స్ ఇండియాకు సెలవు చెప్పింది. కార్ల తయారీ కంపెనీ అయిన ఫోర్డ్ ఇండియా నుండి తప్పుకుంది. అవును, మీరు వింటున్నది నిజమే, ప్రీమియం కార్ల ఉత్పత్తి దారు ఫోర్డ్ కంపెనీ, ఇకపై భారత్ లో కార్ల ఉత్పత్తిని నిలిపివేసింది. ఈ మేరకు ఫోర్డ్ సీఈవో జిమ్ ఫార్లే తెలిపారు. ఇండియాలో ఉన్న రెండు తయారీ ప్లాంట్లను మూసివేస్తున్నట్లు చెబుతూ దానికి కారణాలను నష్టాలే అని తెలిపారు. ఇండియాలో విపరీతంగా పెట్టుబడులు పెట్టినప్పటికీ నష్టాలను చవిచూస్తున్నందున ఇలాంటి నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించింది.
ఇకపై ఫోర్డ్ కార్లు ఇండియాలో తయారు కావు. కేవలం దిగుమతి చేసిన కార్లు మాత్రమే ఇక్కడ దొరుకుతాయని కంపెనీ ప్రకటించింది. ఫోర్డ్ కార్లు ఉత్పత్తి ఆగిపోవడంతో 3వేల మంది ఉద్యోగాలకు వేటు పడనుంది. అలాగే 390కి పైగా కార్ల అమ్మకం దుకాణాలకు ఇబ్బంది కలగనుంది. ఐతే ఇటు ఉద్యోగుల విషయంలో ఫోర్డ్ కంపెనీ నష్టపరిహారాన్ని భరించనుంది. మూడు దశాబ్దాల పాటు ఇండియాలో కార్ల ఉత్పత్తి చేసిన ఫోర్డ్, నష్టాల కారణంగా ఉత్పత్తిని మానుకుంటుంది.