దక్షిణాది స్టార్ హీరోపై విదేశీ క్రికెటర్ ప్రసంశలు

-

శ్రీలంక మాజీ లెజెండరీ స్పిన్నర్ ముత్తయ్య మురళీధరన్ ఈవిత కథ ఆధారంగా ‘800’ అనే టైటిల్ తో సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. విజయ్ సేతుపతి ఈ సినిమాలో నటిస్తున్నారు. తన బయోపిక్‌ లో విజయ్ సేతుపతి ప్రధాన పాత్ర పోషిస్తున్న నేపధ్యంలో… దీనిపై మాట్లాడిన మురళీధరన్… “స్క్రిప్ట్ సిద్ధమైన తర్వాత, ఈ చిత్రానికి సరిగా సరిపోయేది విజయ్ సేతుపతి తప్ప మరొకరు కాదని మేము అనుకున్నాము.” అని చెప్పారు.

“అతను చాలా ప్రతిభావంతుడు అయిన నటుడు మరియు అతను బౌలింగ్ ని కచ్చితంగా ఫాలో అవుతాడు. అతను ఖచ్చితంగా ఈ చిత్రంలో అద్భుతాలు చేస్తాడని నాకు పూర్తి నమ్మకం ఉంది.” అని పేర్కొన్నాడు. విజయ్ సేతుపతి కూడా తన అభిప్రాయం చెప్పాడు. “అతని కథ వినడం మరియు మురళి సార్‌ తో గడపడం చాలా ఆనందంగా ఉంది. అతను ఒక స్టాంప్ లాంటివాడు. ఎక్కడికి వెళ్ళినా అక్కడ ఒక గుర్తు ఉంటుంది అని పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version