హైదరాబాదులో మరో దారుణం జరిగింది. మీర్పేట్ వద్ద లిఫ్ట్ ఇస్తామని విదేశీ యువతిని తీసుకొని వెళ్ళిన కొందరు యువకులు.. పహాడీ షరీఫ్ ప్రాంతంలోని నిర్మానుష్య ప్రాంతంలో విదేశీయురాలిని బెదిరించి లైంగిక దాడికి పాల్పడ్డారు.
తనపై జరిగిన అఘాయిత్యాన్ని బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. లైంగిక దాడికి గురైన యువతిని జర్మనీ దేశస్థురాలుగా పోలీసులు గుర్తించారు. తనపై ముగ్గురు యువకులు దాడికి పాల్పడ్డారని పోలీసులకు ఫిర్యాదు చేయగా.. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితలను పట్టుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. కాగా,నిన్న ఊరుకోండలోనూ ఓ మహిళపై గ్యాంగ్ రేప్ జరిగిన విషయం తెలిసిందే.