అటెండర్ పోస్టు కోసం ఎమ్మెల్యే సంతకం ఫోర్జరీ.. ఎక్కడంటే?

-

అటెండర్ పోస్టు కోసం ఓ వ్యక్తి ఏకంగా ఎమ్మెల్యే సంతకాన్ని ఫోర్జరీ చేశారు. ఈ ఘటన నారాయణ పేట జిల్లాలో బుధవారం ఆలస్యంగా వెలుగుచూసింది. ఎమ్మెల్యే లెటర్ హెడ్ ఉందంటే గురుకుల పాఠశాలలో అటెండర్ పోస్ట్ కూర్చున్న దగ్గరికి వస్తుందని ఓ వ్యక్తి జిల్లాలోని ఓ మహిళను నమ్మించాడు.

అందుకోసం ఏకంగా నారాయణపేట ఎమ్మెల్యే ఫేక్ లెటర్ ప్యాడ్‌పై ఎమ్మెల్యే సంతకాన్ని సైతం ఫోర్జరీ చేశాడు. ఎమ్మెల్యే పర్ణిక రెడ్డి సంతకం ఫోర్జరీ జరిగిన విషయం బయటకు లీకైంది.దీంతో పై స్థాయి నుంచి అధికారులు విచారణ ప్రారంభమైంది. దీనిలో భాగంగా మక్తల్ నియోజకవర్గంలోని నర్వకు చెందిన ఓ వ్యక్తి ఎమ్మెల్యే సంతకాన్ని ఫోర్జరీ చేసినట్లు అధికారులు గుర్తించారు. అతని నుంచి ఫోర్జరీకి వాడిన వస్తువులను స్వాధీనం చేసుకుని విచారణ చేపట్టారు. మరికల్ గురుకుల పాఠశాలలో ఓ మహిళకు అటెండర్ పోస్ట్ ఇప్పించేందుకు ప్రయత్నించిన నిందితుడు గతంలో గురుకుల పాఠశాలలో పనిచేసిన అనుభవం ఉన్నట్లు తెలుస్తోంది.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version