సీఎం రేవంత్ రెడ్డికి చెప్పు చూపించిన బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే

-

సీఎం రేవంత్ రెడ్డి పై మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. బాల్క సుమన్ చెప్పు చూపిస్తూ.. ఈ చెత్త నా కొడుకును చెప్పు తీస్కొని కొట్టాలంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.మంచిర్యాల నియోజక వర్గ సమీక్ష సమావేశంలో మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ మాట్లాడుతూ….మాజీ సీఎం కేసీఆర్ పై సీఎం రేవంత్ రెడ్డి రండా అంటూ అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ ఘాటు గా స్పందించాడు.

చెప్పు చూపిస్తూ సీఎం చెత్తనాకొడుకును చెప్పుతో కొట్టాలంటూ‌ ‘పాగల్ గాడు, హౌ* గాడు. ఈ చెత్త నా కొడుకును చెప్పుతో కొట్టాలి. కానీ సంస్కారం అడ్డు వస్తోంది. బిడ్డా ఖబడ్డార్.. ఇంకోసారి మా కేసిఆర్ ను అంటే లక్షమందితో తొక్కుతాం..’ అని పరుష పదజాలంతో దూషించారు. మంచిర్యాలలో పార్టీ జిల్లా సమీక్ష స్థాయి సమావేశంలో సుమన్ చేసిన ఈ కామెంట్స్ వివాదాస్పదంగా మారాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version