ఒక పక్క దేశ వ్యాప్తంగా కరోనా దెబ్బకు లాక్ డౌన్ విధించిన సంగతి తెలిసిందే. ఈ సమయంలో కూడా ఒక మాజీ సిఎం మాత్రం తన కుమారుడి పెళ్లిని నిర్వహించాలి అని భావించడం వివాదాస్పదంగా మారింది. సామాన్యులు అందరూ పెళ్ళిళ్ళు వాయిదా వేసుకుంటున్నా రాజకీయ నాయకులు మాత్రం తమ కార్యక్రమాలు ఆపడం లేదు. దీనిపై ఇప్పుడు విమర్శలు వస్తున్నాయి.
ఆయన ఎవరో కాదు కర్ణాటక మాజీ సిఎం కుమారా స్వామి. తన కుమారుడు నిఖిల్ వివాహ వేడుక బెంగళూరులోని వధువు రేవతి నివాసంలో జరుగుతుందని మాజీ ముఖ్యమంత్రి కుమార స్వామి వెల్లడించారు. లాక్ డౌన్ విధించినా సరే ఆయన మాత్రం పెళ్లి చెయ్యాలని భావిస్తున్నారు. రామ్‌నగర్‌లోని బిదాదికి సమీపంలో ఉన్న కేతగానహల్లి వద్ద ఈ ఫామ్‌హౌస్ ఉంది.
వివాహం సరళంగా ఉంటుందని, కుటుంబ సభ్యులు మాత్రమే హాజరవుతారని, బయటినుండి ఎవరినీ ఆహ్వానించరని కుమార స్వామి పేర్కొన్నారు. ఏప్రిల్ 17 న ఈ వివాహం జరగనుంది. ఒక పక్క లాక్ డౌన్ లో ప్రజలు ఇబ్బంది పడుతుంటే బంధువులకు ఎవరికి అయినా కరోనా లక్షణాలు ఉంటే ఇబ్బందే కదా అంటూ పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.