రేవంత్ రెడ్డితో భేటీ అయిన గోవా మాజీ సీఎం

-

గోవా మాజీ సీఎం, ప్రస్తుతం రాష్ట్ర అసెంబ్లీలో ఎమ్మెల్యే గా కొనసాగుతున్న కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత దిగంబర్ కామత్ బుధవారం టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు. వ్యక్తిగత పర్యటన నిమిత్తం బుధవారం హైదరాబాద్ వచ్చిన కామత్.. నగరంలోని రేవంత్ రెడ్డి ఇంటికి వెళ్లారు. ఈ సందర్భంగా తెలంగాణలో పార్టీ పటిష్టతకు తీసుకోవాల్సిన చర్యలపై ఆయన పలు సలహాలు, సూచనలు ఇచ్చినట్లు సమాచారం.

కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నేత గానే కాకుండా విద్యావంతులు అధికంగా ఉండే గోవా లాంటి రాష్ట్రానికి సీఎం గా వ్యవహరించిన కామత్.. రాజకీయ వ్యూహాల్లో దిట్టగానే పేరుగాంచారు. 2007 నుంచి 2012 వరకు గోవా సీఎం గా వ్యవహరించిన కామత్.. ఆ తర్వాత దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ క్రమంగా బలహీనపడుతోంది వస్తున్నా.. తాను మాత్రం నిలిచి గెలుస్తున్నారు. ప్రతి ఎన్నికలలో అధికార బీజేపీ కి ముచ్చెమటలు పట్టిస్తున్నారు. ఈ క్రమంలో ఆయన రేవంత్ రెడ్డి ఇంటికి స్వయంగా వెళ్లడం, రేవంత్ రెడ్డికి సలహాలు, సూచనలు ఇవ్వడం ప్రాధాన్యం సంతరించుకుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version