మంత్రి అమర్నాథ్ కు మాజీ మంత్రి హరిరామ జోగయ్య లేఖ

-

మంత్రి గుడివాడ అమర్నాథ్ కు మాజీ మంత్రి, కాపు ఉద్యమనేత హరిరామ జోగయ్య లేఖల యుద్ధం కొనసాగుతూనే ఉంది. తొలుత హరి రామ జోగయ్య మంత్రి అమర్నాథ్ కు లేఖ రాయగా.. మంత్రి గుడివాడ అమర్నాథ్ కౌంటర్ లేఖ రాశారు. రాజకీయాలలో ఇంకా పైకి రావలసిన వ్యక్తివి అని మంత్రి అమర్నాథ్ కి రాసిన లేఖలో పేర్కొన్నారు హరి రామ జోగయ్య.

ఓ మంత్రి పదవికి అమ్ముడుపోయి కాపుల భవిష్యత్తును పాడు చేయవద్దని హితవు పలికారు. ఇక మంత్రి అమర్నాథ్ కౌంటర్ ఇస్తూ.. టిడిపి, జనసేన మధ్య పొత్తును ఎలా సమర్థిస్తారని వంగవీటి రంగా హత్యను ప్రస్తావిస్తూ హరిరామ జోగయ్యను ప్రశ్నించారు. వంగవీటి మోహనరంగా గారిని చంపించినది చంద్రబాబు నాయుడు అని గతంలో హరి రామ జోగయ్య ఆరోపించిన విషయాన్ని అమర్నాథ్ గుర్తు చేశారు. పవన్ కళ్యాణ్ కి రాయాల్సిన లేఖను పొరపాటున తనకు రాశారని ఎద్దేవా చేశారు.

ఇక తాజాగా హరి రామ జోగయ్య మరో లేఖని మంత్రి అమరనాథ్ కి రాశారు. ” వైయస్సార్ పార్టీ 2024 ఎన్నికలలో బీసీ, ఎస్టీ, ఎస్సీ మైనారిటీలో అర్హులైన వారిని ముఖ్యమంత్రి అభ్యర్థిగా నిలబెట్టడానికి సిద్ధంగా ఉందా..? ఈడబ్ల్యూఈఎస్ కోటాలో ఐదు శాతం రిజర్వేషన్ సీఎం జగన్ అమలు చేయలేకపోతే సహచర కాపు మంత్రులు వైయస్సార్ పార్టీకి రాజీనామా చేసి పవన్ కళ్యాణ్ కి సపోర్ట్ చేస్తారా..? ” అని లేఖలో పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version