రేవంత్ సర్కారుపై మాజీ మంత్రి హరీశ్ రావు సీరియస్

-

సీఎం రేవంత్ మూసీ పాదయాత్ర సందర్భంగా ఉమ్మడి నల్గొండ జిల్లాలో చేస్తున్న అక్రమ అరెస్టులపై మాజీ మంత్రి హరీశ్ రావు సీరియస్ అయ్యారు. ప్రభుత్వ చర్యలను ఖండిస్తున్నట్లు పేర్కొన్నారు.ఈమేరకు ఆయన ‘ఎక్స్‌’ వేదికగా స్పందిస్తూ.. బీఆర్ఎస్ కార్యకర్తలను గృహ నిర్బంధం చేస్తే ప్రజల మద్దతు లభించదని ధ్వజమెత్తారు.పాదయాత్ర కాదు.. పాప పరిహార యాత్ర చేసినా కాంగ్రెస్‌ పాపం పోదని ఎద్దేవా చేశారు.

పేదల గూడు కూల్చింది ఒక చోట, పాదయాత్ర మరో చోట అని విమర్శించారు. నగరంలో ఇళ్లు కూల్చి నల్గొండలో పాదయాత్ర చేస్తారా? అని ప్రశ్నించారు.హైదరాబాద్‌ నుంచి పాదయాత్ర మొదలెట్టాలని డిమాండ్‌ చేశారు.ప్రజల మద్దతు ఉంటే నిర్బంధాలు, అక్రమ అరెస్టులు ఎందుకని ప్రశ్నించారు. రేవంత్ పాదయాత్ర నిర్బంధాల మధ్య కొనసాగడం దురదృష్టకరమన్నారు. అరెస్టు చేసిన వారిని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. మూసీ మురికి కూపంగా మారడానికి 50 ఏళ్ల కాంగ్రెస్ పాలన కారణం కాదా? అని హరీశ్‌రావు నిలదీశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version