మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మరణం పట్ల తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన మరణం పట్ల సంతాపం తెలిపిన కేసీఆర్.. భారత ప్రధానిగా డాక్టర్ మన్మోహన్ సింగ్ హయాంలోనే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు జరగడం చారిత్రక సందర్భం అని కేసీఆర్ గుర్తుచేశారు. ఇదిలాఉండగా, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ (92) అనారోగ్యంతోచికిత్స పొందుతూ ఢిల్లీలోని ఎయిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గురువారం రాత్రి కన్నుమూసిన విషయం తెలిసిందే.
ఆయన మరణం పట్ల దేశంలోని పలు జాతీయ, ప్రాంతీయ పార్టీల కీలక నేతలు సంతాపం ప్రకటించారు. ప్రధాని మోడీ సైతం మన్మోహన్ సింగ్ కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి వారిని పరామర్శించడంతో పాటు దివంగత నేత మరణం పట్ల సంతాపం వ్యక్తంచేశారు.
భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మరణం పట్ల కేసీఆర్ దిగ్భ్రాంతి
సంతాపం ప్రకటించిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్
భారత ప్రధానిగా డాక్టర్ మన్మోహన్ సింగ్ హయాంలోనే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు జరగడం చారిత్రక సందర్భం అని కేసీఆర్ అన్నారు pic.twitter.com/ul8KYBo9wc
— Telugu Scribe (@TeluguScribe) December 26, 2024