బాక్సింగ్ డే టెస్టులో ఆస్ట్రేలియా ఆల్ అవుట్ అయింది. భారీ స్కోర్ చేసి ఆల్ అవుట్ అయింది ఆస్ట్రేలియా. మొదటి ఇన్నింగ్స్ లో ఏకంగా 474 పరుగులు చేసిన ఆస్ట్రేలియా…. చివరి వికెట్ కోల్పోయింది. ఇవాళ మ్యాచ్ ప్రారంభమైన మూడున్నర గంటల పాటు… ఆట కొనసాగించిన ఆస్ట్రేలియా 474 పరుగులకు తమ మొదటి ఇన్నింగ్స్ ముగించేసింది.
ఇక ఈ మ్యాచ్ లో స్టీవెన్ స్మిత్ ఏకంగా 140 పరుగులు చేసి దుమ్ము లేపాడు. అటు ఓపెనర్లు ఇద్దరూ కూడా ఆఫ్ సెంచరీలు చేశారు. అలాగే మార్నస్ 72 పరుగులు, ఆస్ట్రేలియా కెప్టెన్ కమిన్స్ 49 పరుగులు చేసి రాణించాడు. ఇక టీమిండియా బౌలర్లలో బుమ్రాకు నాలుగు వికెట్లు పడ్డాయి. ఆకాశ్ దీప్ రెండు వికెట్లు, రవీంద్ర జడేజా 3 వికెట్లు వాషింగ్టన్ సుందర్ ఒక వికెట్ తీశారు.