రాష్ట్రంలో ఫార్ములా ఈ రేసు కేసు వ్యవహారం సంచనం రేపుతోంది. ఈ కేసులో బీఆర్ఎస్ హయాంలో మాజీ మంత్రి , బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అవినీతికి పాల్పడ్డారని, ప్రభుత్వ అనుమతులు లేకుండా, ఆర్బీఐ నిబంధనలకు విరుద్ధంగా రూ.55 కోట్ల హెచ్‌ఎండీఏ ధనాన్ని విదేశీ కంపెనీకి చెల్లించాడని ఆయన మీద అభియోగాన్ని ఏసీబీ, ఈడీ అధికారులు మోపారు. ప్రస్తుతం ఈ కేసులో కేటీఆర్, ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ విచారణ ఎదుర్కొంటున్నారు.
తాజాగా ఫార్ములా ఈ రేసు వ్యవహారంలో సీఎం రేవంత్ సర్కారుకు ఝలక్ ఇచ్చారు ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్. బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచిన ఆయన ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్నారు. ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ..‘ఫార్ములా-ఈ రావడం వల్ల హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెరిగింది.
అప్పట్లోనే ఫార్ములా- 1 తీసుకు రావాలని చంద్రబాబు గచ్చిబౌలిలో భూసేకరణ చేశారు.కానీ, కొన్ని కారణాల వల్ల రాలేదు. ఫార్ములా-ఈ రావడం వల్ల హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెరిగింది అనేది మాత్రం నిజం’ అని దానం నాగేందర్ చెప్పుకొచ్చారు.