వేళకాని వేళల్లో బెనిఫిట్ షోస్ అవసరం ఏముంది? : హైకోర్టు

-

పెద్ద హీరోల సినిమాలకు వేళకాని వేళల్లో బెనిఫిట్ షోలకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతులు ఇవ్వడాన్ని హైకోర్టు తప్పుబట్టింది. ఇటీవలి ఉదంతాలు చూసిన తరువాత కూడా మీరు మారరా? అని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. గేమ్ ఛేంజర్ సినిమా టికెట్ ధరల పెంపు విషయంలో రేవంత్ సర్కార్ తీరుపై హైకోర్టు అసహనం వ్యక్తం చేసింది.

High Court to consider those who studied MBBS, BDS in Telangana as locals

ప్రజల భద్రత గురించి కనీసం ఆలోచించరా? అంటూ నిలదీసింది. ఈనెల 8న ఇచ్చిన సినిమా టికెట్ ధరల పెంపు ఉత్తర్వులను సవాల్ చేస్తూ వేసిన పిటిషన్‌పై విచారణ చేపట్టిన జస్టిస్ విజయ్‌సేన్ రెడ్డి ఈ సందర్బంగా కీలక వ్యాఖ్యలు చేశారు.సినిమా ప్రదర్శనకు సమయపాలన ఉండాలని.. అర్దరాత్రి,వేకువజామున అనుమతులు ఇవ్వడం మానవ హక్కుల ఉల్లంఘన అవుతుందని పేర్కొన్నారు. 16 ఏళ్ల లోపు పిల్లలను అర్దరాత్రి, తెల్లవారుజాము ప్రదర్శనల్లో అనుమతించకుండా చర్యలు తీసుకోవాలని ఉత్తర్వులు ఇచ్చారు. గేమ్ ఛేంజర్ సినిమా టికెట్ల పెంపు అంశంపై నేడు తదుపరి విచారణ కొనసాగనుంది. కాగా,పుష్ప-2 ఘటన తర్వాత బెనిఫిట్ షోలకు అనుమతిచ్చే ప్రసక్తే లేదని రేవంత్ సర్కార్ స్పష్టంచేసిన విషయం తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Exit mobile version