ఫార్ములా ఈ-రేస్ ప్రాక్టీస్ సెషన్-2 ప్రారంభం

-

అత్యంత ప్రతిష్ఠాత్మకమైన ఫార్ములా ఈ-ప్రపంచ ఛాంపియన్‌షిప్ హైదరాబాద్‌లో జరుగుతోంది. హుస్సేన్‌సాగర్‌లోని ఎన్టీఆర్ మార్గ్ ఈ-కార్లతో సందడిగా మారింది. ప్రధాన రేసుకు ముందు ప్రాక్టీస్ రేసులు జరుగుతున్నాయి. శుక్రవారం రోజున మొదటి సెషన్ ప్రాక్టీస్ రేసు జరగగా.. ఇవాళ రెండో సెషన్ ప్రారంభమైంది.

అనంతరం 10.40 గంటలకు అర్హత పోటీలు నిర్వహించనున్నారు. అందులో క్వాలిఫై అయిన రేసర్లు.. మధ్యాహ్నం 3 గంటలకు ప్రధాన రేసులో ఛాంపియన్‌షిప్‌ కోసం తలపడనున్నారు. హుస్సేన్‌సాగర్‌ తీరప్రాంతంలో 2.8కిలోమీటర్ల నిడివితో ప్రత్యేకంగా నిర్మించిన సర్క్యూట్‌పై మొత్తం 11 జట్లు, 22 మంది రేసర్లు తమ కార్లను పరుగులు పెట్టించనున్నారు.

దాదాపు 21 వేల మంది పోటీలను వీక్షించనున్నారు. ఈ నేపథ్యంలో రేసింగ్‌ నిర్వహించే ఎన్టీఆర్‌ మార్గ్‌, సచివాలయం, మింట్‌కాంపౌండ్‌, తెలుగు తల్లి ఫ్లైఓవర్‌ పరిసర ప్రాంతాలను పోలీసులు పూర్తిగా మూసివేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version