తెలంగాణ కుంభమేళాగా ప్రాచుర్యం పొందిన మేడారం శ్రీ సమ్మక్క సారమ్మల మహా జాతర ఈనెల 21న మొదల కాబోతోంది. 24 వరకు ఇది జరగనుంది. రెండేళ్లకి ఒక సారి జరిగే ఈ గిరిజన మహా జాతరకి తెలంగాణ ప్రజలతో పాటుగా కర్ణాటక మహారాష్ట్ర నుండి కూడా ప్రజలు వస్తున్నారు. ఇందుకు తెలంగాణ ప్రభుత్వం అనేక రకాల చర్యలను తీసుకుంది భక్తుల ని సురక్షితంగా మేడారం తీసుకొచ్చి తిరిగి గమ్యస్థానాలు చేయడానికి టిఎస్ఆర్టిసి 6000 ప్రత్యేక బస్సులను నడుపుతోంది.
రెండేళ్లకొకసారి ఇవి జరుగుతాయి. ఈ మహా జాతరకి ఈసారి దాదాపు రెండు కోట్ల మంది భక్తులు తరలి వస్తారని అధికారులు అంచనా వేశారు. ములుగు జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. జాతర సందర్భంగా భారీగా ప్రజలు వస్తారు కనుక ఈ నెల 21 నుండి 24 వరకు ములుగు జిల్లాలోని అన్ని ప్రభుత్వ ప్రైవేటు విద్యా సంస్థలు కాలేజీలు ప్రభుత్వ కార్యాలయాలకు సెలవులు ప్రకటించారు.