గులాబీ పార్టీకి బిగ్ షాక్ తగిలింది. కాలేజీల వద్ద డబ్బులు వసూలు చేస్తున్నారని బీఆర్ఎస్ నేతలపై పెద్ద ఎత్తున ఆరోపణలు వినిపిస్తున్న క్రమంలో బీఆర్ఎస్ విద్యార్థి విభాగం స్టేట్ సెక్రటరీ నాగారం ప్రసాద్‌ను గురువారం పోలీసులు అరెస్ట్ చేశారు. ఇంజినీరింగ్ కాలేజీ యాజమాన్యాలను డబ్బులు పేరుతో నాగారం ప్రసాద్ ముఠా బెదిరిస్తున్నట్లు పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చాయి.
ఇంజినీరింగ్ కాలేజీల్లో అడ్మిషన్‌తో పాటు రూ.10 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ..కాలేజీల యాజమాన్యాలపై బెదిరింపులకు దిగుతున్నట్లు ఆరోపణలున్నాయి. ఈ మేరకు కాలేజీల యాజమాన్యాల నుంచి ఫిర్యాదులు అందడంతో బీఆర్ఎస్వీ స్టేట్ సెక్రటరీ ప్రసాద్‌ను నార్సింగి పోలీసులు అరెస్ట్ చేసి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. విచారణ పూర్తయ్యాక పూర్తి వివరాలు వెల్లడిస్తామని పోలీసులు తెలిపారు.