ఇండియన్ రైల్వే శుభ వార్త అందించింది. అదేంటంటే ఉచితంగా టికెట్ బుక్ చేసుకునే అవకాశాన్ని కల్పించింది. అంటే పూర్తి ఉచితంగా కాదనుకోండి. కానీ చేసుకోవచ్చు. ఎలా అనేది ఇప్పుడు చూద్దాం. ఎస్‌బీఐ ఒక రూపే కార్డును తీసుకొచ్చింది. ‘ఐఆర్‌సీటీసీ ఎస్‌బీఐ రూపే కార్డ్’ పేరుతో తీసుకొచ్చిన ఈ కార్డును ఉపయోగించి వినియోగదారులు నిబంధనల మేరకు ఉచితంగా టికెట్లు బుక్ చేసుకోవచ్చు. అదెలా అంటే ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్ ద్వారా ఈ కార్డును ఉపయోగించి రైలు టికెట్లు బుక్ చేసుకునేవారు 10 శాతం రివార్డు పాయింట్లు పొందవచ్చు.
అంటే ఒక రివార్డు పాయింట్ ఒక రూపాయికి సమానం. ఈ మార్చి 31, 2021 వరకూ ఎలాంటి రుసుములు లేకుండా ఈ కార్డును పొందవచ్చు. అలా వచ్చిన పాయింట్లను ఉపయోగించి వినియోగదారులు ఉచితంగా టికెట్లు బుక్ చేసుకోవచ్చని చెబుతున్నారు. మొదటి 45 రోజుల్లో రూ.500 అంతకన్నా ఎక్కువ లావాదేవీలు జరిపిన వినియోగదారులు 350 బోనస్ రివార్డ్ పాయింట్లను కూడా పొందవచ్చు. అలా ఐఆర్‌సీటీసీ ద్వారా టికెట్లు బుక్ చేసుకున్న వారు చెల్లించాల్సిన లావాదేవీ ఛార్జీల్లో 1శాతం తగ్గుతుంది.