తెల్లవారి పాలనపై తిరుగుబాటు జెండా ఎగరేసిన విప్లవ కారుడు.. బిర్సా ముండా..

-

బిర్సా ముండా..గిరిజనుల హక్కుల కోసం రక్తాన్ని చిందించిన గొప్ప విప్లవ కారుడు..ఈయన గురించి చెప్పాలంటే మాటలు చాలవు..రాయాలంటే రాతలు చాలవు. నేడు ఆ మహనీయుడు వర్దింతి..ఈ సందర్భంగా ఆయన గురించి తెలుసుకుందాం..

స్వాతంత్య్ర సమరయోధుడు..గిరిజిన నాయకుడు అయిన ఈయన గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే..కొందరు ప్రముఖుల పేర్లు తప్ప ఈయన పేరును ఈ తరం యువత పెద్దగా విని ఉండరు..దేశం కోసం నెత్తురు చిందించిన మహానుభావులలో ఒకరు.ఈయన గురించి తెలుసుకోవడం మన భాధ్యత.ఈసందర్భంగా బిర్సా జీవితంలోని పలు కీలక ఘట్టాలను తెలుసుకుందాం..

బిర్సా ముండా 1875 సంవత్సరం నవంబరు 15న జార్ఖండ్ లోని ఉలిహతు గ్రామంలో జన్మించారు. పశ్చిమ సింగ్భమ్ జిల్లాలోని ఓ క్రైస్తవ మిషనరీ పాఠశాలలో చదువుకున్నారు. అక్కడే ఇతర దేశాల చరిత్ర, ఆధునిక శాస్త్ర విజ్ఞానాన్ని గురించి తెలుసుకున్నారు.  ఆ ఫలితంగానే బ్రిటీషర్లు భారతదేశంలో సాగిస్తున్న దురాక్రమణ, సామ్రాజ్యవాద పాలనపై అవగాహన పెంచుకున్నారు.  తెల్లవారి పాలనపై పోరాడనిదే దేశానికి స్వాతంత్య్రం రాదని భావించారు.అతి చిన్న వయస్సులోనే ( 22 ఏళ్ళు) బ్రిటీషర్లపై యుద్ధం ప్రకటించారు. వారికి నిద్ర లేకుండా చేశారు. ఆదివాసీ, గిరిజనుల ఆత్మాభిమానం కోసం గళమెత్తారు. బ్రిటీష్ వారి నిరంకుశ చట్టాలకు వ్యతిరేకంగా గళమెత్తుతూ భారత స్వాతంత్య్ర ఉద్యమంలో కీలక భూమిక పోషించారు. చోటా నాగపూర్ ప్రాంతంలో ఆదివాసీల హక్కుల కోసం ఒక ఉద్యమాన్ని చేసారు.

కుంతి, తామర్, బసియా, రాంచీ ప్రాంతాలు కేంద్రంగా మిలిటెంట్ ఉద్యమాన్ని నడిపారు. దీంతో వణికిపోయిన బ్రిటీష్ పాలకులు దొంగ దెబ్బ తీశారు..అతన్ని 1900  జనవరి 5న దారుణంగా కాల్చారు..అతన్ని చంపినందుకు ఆయా ప్రభుత్వం 500 రూపాయల రివార్దును కూడా అందించారు.

బ్రిటీష్ బలగాలు కూడా ఆయన కోసం దుంబర్ హిల్ అనే పర్వత ప్రాంతంలో ప్రత్యేక సెర్చ్ ఆపరేషన్ నిర్వహించాయి. ఈక్రమంలో తారసపడిన బిర్సాపై బ్రిటీష్ బలగాలు కాల్పులు జరిపారు. అయినా చాకచక్యంగా తప్పించుకున్న బిర్సా.. జంకోపాయి అనే అటవీ ప్రాంతంలో 1900 మార్చి 3న అరెస్టు అయ్యారు. అరెస్టు అయిన మూడు నెలల్లోనే (జూన్ 09న) రాంచీ  జైలులో అనుమానాస్పద  స్థితిలో  ఆయన చనిపోయారు.

ఆయన మరణం పై ఎన్నో కథనాలు వచ్చాయి.ఆయనకు  జైలులో ఉండగా విషం ఇచ్చి ఉంటారని చరిత్రకారులు చెబుతారు.  వీర మరణం పొందే సమయానికి బిర్సా ముండా వయసు 25 ఏళ్లు మాత్రమే. అతి చిన్న వయసులో  దేశం కోసం ప్రాణాలర్పించిన బిర్సా ముండా ఈతరానికి స్ఫూర్తి ప్రదాత.  ఆయన  చేపట్టిన ఉద్యమ  ఫలితంగానే తదనంతర కాలం(1908)లో బ్రిటీష్ ప్రభుత్వం చోటా నాగ్ పూర్ కౌలు హక్కుదారుల చట్టాన్ని తీసుకొచ్చింది. అయితే, ఆ చట్టం ద్వారా కూడా ఆదివాసీలకు పూర్తి న్యాయం జరగలేదు..ఆయన మరణం తర్వాత అసలు వాళ్లను పట్టించుకున్న నాధుడే లేడు.. ఈరోజు ఆయన వర్ధంతి సందర్భంగా భారత పౌరులమైన మనం ఒకసారి స్మరించుకుందాము..

Read more RELATED
Recommended to you

Exit mobile version